News September 24, 2024
లడ్డూలో పొగాకు పొట్లం వార్తలను ఖండించిన TTD
తిరుమల శ్రీవారి లడ్డూలో పొగాకు పొట్లం ఉన్నట్లు వస్తోన్న <<14180009>>ఆరోపణలను<<>> టీటీడీ కొట్టిపారేసింది. ‘పోటులో శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అత్యంత భక్తిశ్రద్ధలతో, నియమ నిష్ఠలతో, శ్రీవారి లడ్డూలను ప్రతిరోజు లక్షలాదిగా తయారు చేస్తారు. ఈ లడ్డూల తయారీ కూడా సీసీటీవీల పర్యవేక్షణలో ఉంటుంది. ఇంతటి పకడ్బందీగా ఉన్న వ్యవస్థలో పొగాకు ఉన్నట్లు ప్రచారం చేయడం శోచనీయం’ అని ప్రకటన విడుదల చేసింది.
Similar News
News October 11, 2024
సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం!
బారామతికి సంబంధించి శరద్ పవార్ పంపిన ప్రతిపాదనలను CM ఏక్‌నాథ్ శిండే క్యాబినెట్ ముందుంచడంపై Dy.CM అజిత్ కినుక వహించినట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం జరిగిన క్యాబినెట్ భేటీలో వీరిద్దరి మధ్య వాడీవేడి చర్చ జరిగినట్టు స్థానిక మీడియా తెలిపింది. శిండే ప్రవేశపెట్టిన అంశాల ఆమోదానికి అజిత్ నిరాకరించారని, అనంతరం మీటింగ్ నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, అజిత్ దీన్ని ఖండించారు.
News October 11, 2024
రేపు ఏపీవ్యాప్తంగా వర్షాలు
ఏపీవ్యాప్తంగా రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
News October 11, 2024
ఆ మ్యాచ్‌కి భారత జట్టు కెప్టెన్ ఎవరు?
ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో మొదటి రెండు మ్యాచ్‌లలో ఒకదానికి కెప్టెన్ <<14326057>>రోహిత్ శర్మ గైర్హాజరయ్యే<<>> అవకాశం ఉండడంతో ఆ మ్యాచ్‌కి సారథ్యం వహించేది ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషభ్ పంత్‌లలో ఒకరికి కెప్టెన్‌గా ఛాన్స్ దక్కే అవకాశం ఉందని తెలుస్తోంది. AUS లాంటి బలమైన జట్టుతో మ్యాచ్ కాబట్టి మళ్లీ కోహ్లీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.