News September 24, 2024

కాన్పూర్ టెస్టులో బంగ్లాకు స్పిన్ ఉచ్చు?

image

బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో పేస్ పిచ్‌పై సునాయాసంగా గెలిచిన టీమ్ ఇండియా, కాన్పూర్‌లో ఫ్లాట్ పిచ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చివరి రెండు రోజులు బంతి గింగిరాలు తిరిగేందుకు నల్లమట్టి శాతం ఎక్కువగా ఉన్న పిచ్‌ను తయారు చేయించారు. తొలుత బ్యాటింగ్‌కు, చివరి రెండు రోజులు స్పిన్‌కు స్వర్గధామంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చని అంచనా.

Similar News

News November 3, 2025

బస్సు ప్రమాదం.. దిక్కుతోచని స్థితిలో చిన్నారులు

image

TG: మీర్జాగూడ <<18183773>>ప్రమాదం<<>> పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఈ ఘటనలో ఓ మహిళ మరణించగా ఆమె భర్తకు గాయాలవ్వడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో వారి ముగ్గురు పిల్లలు అదృష్టవశాత్తు సురక్షితంగా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే ఓవైపు తల్లి మరణం, మరోవైపు ఆసుపత్రిలో తండ్రి ఉండటంతో ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆ చిన్నారులు ఉండిపోయారు. ఈ దృశ్యం స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.

News November 3, 2025

తగ్గుతున్న ఆకుకూరల సాగు.. కారణమేంటి?

image

ఒకప్పుడు చాలా రకాల ఆకుకూరల లభ్యత, వినియోగం ఉండేది. ఇప్పుడు తోటకూర, మెంతి కూర, పాలకూర, పుదీనా, గోంగూర, కొత్తిమీర, బచ్చలికూరలనే మనం ఎక్కువగా వినియోగిస్తున్నాం. ఆకుకూరల సాగులో రైతుల కష్టం ఎక్కువగా ఉండటం, వరద ముంపునకు గురైతే పంట పూర్తిగా నష్టపోవడం వంటి కారణాల వల్ల.. రైతులు ఎక్కువ ధర పలికే కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల సాగువైపు మొగ్గుచూపుతున్నారు. ఫలితంగా కాలక్రమేణా ఆకుకూరల సాగు, వినియోగం తగ్గుతోంది.

News November 3, 2025

శక్తిమంతమైన శివ మంత్రాలు

image

1. ఓం నమః శివాయ
2. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
3. ఓం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్
4. కర్పూర్ గౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం
సదావసంతం హృదయారవిందే భవం భవానీసహితం నమామి
5. క‌రచరణా కృతం వా కాయ‌జం క‌ర్మజం వా
శ్రవ‌న్నయ‌న‌జం వా మాన‌సం వా ప‌ర‌ధాం విహితం విహితం వా
స‌ర్వ మేత‌త క్షమ‌స్వ జ‌య జ‌య క‌రుణాబ్దే శ్రీ మ‌హ‌దేవ్ శంభో