News September 24, 2024
కాన్పూర్ టెస్టులో బంగ్లాకు స్పిన్ ఉచ్చు?
బంగ్లాదేశ్‌తో తొలి మ్యాచ్‌లో పేస్ పిచ్‌పై సునాయాసంగా గెలిచిన టీమ్ ఇండియా, కాన్పూర్‌లో ఫ్లాట్ పిచ్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. చివరి రెండు రోజులు బంతి గింగిరాలు తిరిగేందుకు నల్లమట్టి శాతం ఎక్కువగా ఉన్న పిచ్‌ను తయారు చేయించారు. తొలుత బ్యాటింగ్‌కు, చివరి రెండు రోజులు స్పిన్‌కు స్వర్గధామంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లూ ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగొచ్చని అంచనా.
Similar News
News October 9, 2024
ఏపీ ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం
AP: లిక్కర్ షాపుల టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 11 వరకు అప్లికేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. వాటిని వెరిఫై చేసి 14న డ్రా తీసి సెలక్ట్ చేస్తామని చెప్పారు. 16 నుంచి కొత్త లైసెన్స్ పీరియడ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.
News October 9, 2024
టీడీపీలో చేరిన మాజీ ఎంపీలు
AP: మాజీ ఎంపీలు మోపిదేవి వెంకట రమణ, బీద మస్తాన్ రావు సీఎం చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. ఇటీవల రాజ్యసభ సభ్యత్వానికి, వైసీపీకి వీరిద్దరూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
News October 9, 2024
ఉమెన్స్ WC: బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచులో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.
IND: షఫాలీ, మంధాన, జెమిమా, హర్మన్(C), రిచా, దీప్తి, సాజన, అరుంధతి, శ్రేయాంక, శోభన, రేణుక.
SL: విష్మీ గుణరత్నే, చమరి ఆటపట్టు(C), హర్షిత, కవిష, నీలాక్షి, అనుష్క, కాంచన, సుగంధిక, ఇనోషి, ఉదేషికా, ఇనోక.