News September 24, 2024

భార్యను ఆర్థికంగా ఆదుకొనే బాధ్యత భర్తదే: ఢిల్లీ హైకోర్టు

image

భార్య సంపాదించగలిగినప్పటికీ, ఆమెను ఆర్థికంగా ఆదుకునే బాధ్యత భర్తదేనని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఆమెను ‘పరాన్నజీవి’ అని పిలవడం ఆమెకే కాకుండా మహిళలందరికీ అగౌరవమే అని వ్యాఖ్యానించింది. భార్యకు భరణం చెల్లించాలన్న కింది కోర్టు ఆదేశాల‌ను భర్త SCలో సవాల్ చేశారు. కేసు విచారణ సందర్భంగా భారతీయ మహిళలు తమ కుటుంబం, పిల్లలు, భర్త-అతని తల్లిదండ్రులను చూసుకోవడానికి తమ ఉద్యోగాలను వదిలేస్తున్నారని పేర్కొంది.

Similar News

News September 25, 2024

భూమికి భారంగా చైనా డ్యామ్!

image

చైనాలోని త్రీ గోర్జెస్ డ్యామ్ ప్రపంచంలోనే అత్యంత పెద్దది. ఏకంగా 10 ట్రిలియన్ గాలన్ల నీరు అందులో నిల్వ ఉంటుంది. అంత బరువు ఒకేచోట నిల్వ ఉండటం భూమి గమనాన్ని ప్రభావితం చేస్తోంది. 0.06 సెకన్ల మేర భూ పరిభ్రమణ వేగం నెమ్మదించిందని పరిశోధకులు చెబుతున్నారు. దాని వల్ల సూర్యుడి నుంచి 2 సెంటీమీటర్ల దూరం పెరిగిందన్నారు. ఈ డ్యామ్ కారణంగా భూకంపాలు, పెను విపత్తులు సంభవిస్తాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News September 25, 2024

ఆసీస్‌కు మన బౌలింగ్ వేడి తగులుతుంది: మంజ్రేకర్

image

ఆస్ట్రేలియాలో బోర్డర్ గవాస్కర్ సిరీస్‌కు భారత్ తమ అత్యుత్తమ పేస్ దళాన్ని తీసుకెళ్లాలని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ సూచించారు. ‘బుమ్రా, షమీ, సిరాజ్, ఆకాశ్ దీప్‌తో కూడిన టీమ్ ఇండియా పేస్ బ్యాటరీ ఎన్నడూ లేనంత బలంగా ఉంది. ఆస్ట్రేలియాకు ఆ వేడి కచ్చితంగా తగులుతుంది. మన ప్లేయర్స్ బ్యాటింగ్ బాగా చేయడమే కీలకం. సీనియర్లు బరువును మోయాలి. భారత్ ఈసారి కూడా సిరీస్ గెలుస్తుందనే అనుకుంటున్నా’ అని పేర్కొన్నారు.

News September 25, 2024

VIRAL: ఆఫీస్ కుర్చీలో కూర్చొని ఆటో డ్రైవింగ్!

image

బెంగళూరులో ఓ ఆటో డ్రైవర్ ఆటోలోని సీటును తొలగించి, ఆఫీసు కుర్చీని బిగించుకున్నారు. అందులో కూర్చొని డ్రైవ్ చేస్తున్నారు. దీనిని ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారింది. ఆయనకు బ్యాక్ పెయిన్ వచ్చి అలా చేశారేమో అంటూ పలువురు నెటిజన్లు ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు ఇది మోటార్ వెహికల్ యాక్ట్‌కు విరుద్ధమని పేర్కొంటున్నారు.