News September 25, 2024

మంత్రులు జూపల్లి, ఉత్తమ్‌కు చేదు అనుభవం

image

TG: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించేందుకు మంత్రులు వెళ్లగా నిర్వాసితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవితోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భూ నిర్వాసితులపై మండిపడ్డారు.

Similar News

News September 25, 2024

కొనసాగుతున్న కాళేశ్వరం కమిషన్ విచారణ

image

TG: కాళేశ్వరం కార్పొరేషన్ అకౌంట్స్ అధికారులు ఇవాళ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. ప్రాజెక్టుకు నిధుల సేకరణ, బిల్లుల చెల్లింపు, ఉద్యోగుల జీతాల చెల్లింపు తదితర అంశాలపై వారిని కమిషన్ ప్రశ్నించింది. బిల్లుల చెల్లింపులు నిబంధనల ప్రకారమే జరిగినట్లు ఆఫీసర్లు తెలిపారు. ప్రాజెక్టు చెల్లింపులపై ఆడిట్ రిపోర్ట్ ఆధారంగానే కాగ్ రిపోర్టు ఇచ్చిందని చెప్పారు.

News September 25, 2024

‘గేమ్ ఛేంజర్’ నుంచి సెకండ్ సాంగ్ ప్రోమో ఎప్పుడంటే?

image

రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న చిత్రం ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా నుంచి సెకండ్ సింగిల్ ‘రా మచ్చ మచ్చ’ సాంగ్ ప్రోమోను ఈ నెల 28న రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సాంగ్‌కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

News September 25, 2024

Stock Market: సెన్సెక్స్, నిఫ్టీ ఆల్ టైం హై

image

ప‌వ‌ర్, ఫైనాన్స్ రంగ షేర్లు బూస్ట్ ఇవ్వ‌డంతో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు బుధ‌వారం జీవిత‌కాల గ‌రిష్ఠాల‌కు చేరుకున్నాయి. సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 85,169కు, నిఫ్టీ 63 పాయింట్ల లాభంతో 26,004కు చేరుకున్నాయి. బలమైన లిక్విడిటీ కారణంగా మార్కెట్‌లో బుల్ జోరు కొన‌సాగుతోంద‌ని, మార్కెట్లు మ‌రింత‌గా విస్త‌రించ‌వ‌చ్చ‌ని, సెన్సెక్స్‌ త్వ‌ర‌లో ల‌క్ష‌కు చేరుకోవ‌చ్చ‌ని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.