News September 25, 2024

మంత్రులు జూపల్లి, ఉత్తమ్‌కు చేదు అనుభవం

image

TG: ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావుకు చేదు అనుభవం ఎదురైంది. ఉదండాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలించేందుకు మంత్రులు వెళ్లగా నిర్వాసితులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎంపీ మల్లు రవితోనూ వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి భూ నిర్వాసితులపై మండిపడ్డారు.

Similar News

News October 9, 2024

నిరుద్యోగులతో సర్కార్ చెలగాటం: షర్మిల

image

AP: నాలుగు నెలలుగాAPPSCకి ఛైర్మన్‌ను నియమించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని PCC చీఫ్ YS షర్మిల మండిపడ్డారు. ఏపీపీఎస్సీపై నిర్లక్ష్యం వహిస్తూ నిరుద్యోగులతో చెలగాటం ఆడుతోందని విమర్శించారు. ‘శ్వేతపత్రాలపై పెట్టిన శ్రద్ధ, ఏపీపీఎస్సీపై కూడా పెట్టాలి. తక్షణమే దానికి ఛైర్మన్‌ను నియమించాలి. వాయిదా వేసిన పరీక్షలతో పాటు ఇప్పటికే విడుదలైన నోటిఫికేషన్లకు కూడా షెడ్యూల్ ప్రకటించాలి’ అని ఆమె డిమాండ్ చేశారు.

News October 9, 2024

BJPలో చేరిన ఇద్దరు ఇండిపెండెంట్ MLAలు

image

హరియాణాలో ఇద్దరు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు BJPలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ ధర్మేంద్ర ప్రధాన్‌ సమక్షంలో ఎమ్మెల్యేలు దేవేందర్ కడ్యాన్, రాజేశ్ జూన్‌ కమలం గూటికి చేరుకున్నారు. వీరి చేరికతో బీజేపీ ఎమ్మెల్యేల బలం 50కి చేరుకుంది. మరోవైపు భారత సంపన్న మహిళ, హిసార్ ఎమ్మెల్యే సావిత్రి జిందాల్ కూడా బీజేపీకి మద్దతు ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

News October 9, 2024

గ్రూప్-1 మెయిన్స్‌పై కీలక అప్‌డేట్

image

TG: గ్రూప్-1 మెయిన్స్ హాల్ టికెట్లను ఈనెల 14న విడుదల చేయనున్నట్లు TGPSC ప్రకటించింది. అదే రోజు నుంచి కమిషన్ వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఈనెల 21 నుంచి 27వ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు జరగనున్న సంగతి తెలిసిందే.