News September 26, 2024
ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది.
Similar News
News January 14, 2026
549 పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్ డేట్

BSF స్పోర్ట్స్ కోటాలో 549 కానిస్టేబుల్(GD) పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. టెన్త్ పాసై, శారీరక ప్రమాణాలు కలిగి, జాతీయ, అంతర్జాతీయ స్థాయులో క్రీడల్లో రాణిస్తున్నవారు అర్హులు. వయసు 18-23 ఏళ్ల మధ్య ఉండాలి. PST, స్పోర్ట్స్ ప్రదర్శన, CV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. బేసిక్ పే రూ.21,700-69,100. వెబ్సైట్: https://rectt.bsf.gov.in/ *మరిన్ని ఉద్యోగాల కోసం<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 14, 2026
సంప్రదాయ రుచుల సంక్రాంతి సంబరం

సంక్రాంతి అంటేనే పిండివంటల ఘుమఘుమలు. ఈ పండుగ నాడు పాలు పొంగించి చేసే పొంగలితో పాటు పరమాన్నం, పులిహోర, గారెలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సంప్రదాయాలకు ప్రతీకగా అరిసెలు, బూరెలు, జంతికలు, సకినాలు, మురుకులు, లడ్డూలు చేసుకుంటారు. ఈ వంటలన్నీ ఇంటిల్లపాదికి సంతోషాన్ని పంచుతాయి. భోగభాగ్యాలతో, కొత్త ధాన్యపు రాశులతో ప్రతి ఇంటా సిరిసంపదలు కురిపిస్తూ, కొత్త కాంతులను విరజిమ్మాలన్నదే ఈ పండుగ ఇచ్చే సందేశం.
News January 14, 2026
ఇరాన్ ఘర్షణలు రక్తసిక్తం.. 2,571 మంది మృతి!

ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు తీవ్ర హింసాత్మకంగా మారుతున్నాయి. ఆందోళనకారులను అణచివేసేందుకు భద్రతా దళాలు జరుపుతున్న కాల్పుల్లో మరణించిన వారి సంఖ్య 2,571కి చేరినట్లు అమెరికాకు చెందిన మానవ హక్కుల సంస్థ తెలిపింది. వీరిలో 147 మంది భద్రతా సిబ్బంది కూడా ఉన్నట్లు వెల్లడించింది. మరో 18,100 మంది అరెస్టైనట్లు పేర్కొంది. ఉద్రిక్తతలను అణచివేసేందుకు ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.


