News September 26, 2024

ఇవాళ ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, అనకాపల్లి, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడొచ్చని పేర్కొంది.

Similar News

News October 12, 2024

INDvBAN: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇండియా

image

హైదరాబాద్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. 3 మ్యాచుల సిరీస్‌ను ఇప్పటికే భారత్ 2-0తో కైవసం చేసుకుంది. భారత జట్టు: సంజూ, అభిషేక్, సూర్య, నితీశ్, హార్దిక్, పరాగ్, రింకూ, సుందర్, చక్రవర్తి, బిష్ణోయ్, మయాంక్

News October 12, 2024

మహిళల టీ20 WC.. భారత్ సెమీస్ చేరాలంటే?

image

మహిళల టీ20 వరల్డ్ కప్‌లో గ్రూప్ ఏ నుంచి ఆస్ట్రేలియా సెమీస్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది. రెండో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్, పాక్ మధ్య పోటీ నెలకొంది. భారత్ సెమీస్ చేరాలంటే రేపు ఆసీస్‌తో జరిగే మ్యాచ్‌లో తప్పక గెలవాలి. భారీ తేడాతో గెలిస్తే సులభంగా సెమీస్ చేరుతుంది. లేదంటే కివీస్ ఆడే చివరి 2 మ్యాచుల్లో ఓడాలి లేదా ఒకదాంట్లోనైనా చిత్తుగా ఓడాలి. అప్పుడు మెరుగైన నెట్ రన్‌‌రేట్‌తో భారత్ సెమీస్ చేరుతుంది.

News October 12, 2024

చెర్రీ, బాలయ్య సినిమాల నుంచి అప్‌డేట్స్

image

మెగా, నందమూరి ఫ్యాన్స్‌కు విజయ దశమి రోజున అప్‌డేట్స్ వచ్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ను వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ చేస్తామని నిర్మాత దిల్ రాజు ఇప్పటికే ప్రకటించారు. ఆ డేట్‌తో చరణ్ పిక్‌ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇక నందమూరి బాలక‌ృష్ణతో బాబీ కొల్లి తెరకెక్కిస్తున్న NBK109 మూవీని సంక్రాంతికి తీసుకురానున్నట్లు ఆ మూవీ టీమ్ ప్రకటించింది. దీపావళికి టైటిల్, టీజర్‌ను వదలనున్నట్లు తెలిపింది.