News September 26, 2024

కంఫర్ట్ జోన్‌లోనే భారత్ అప్పులు: నిర్మల

image

భారత్ అప్పులన్నీ కంఫర్ట్ జోన్‌లోనే ఉన్నాయని FM నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలోని చాలా మిడిల్ ఇన్‌కం కంట్రీస్‌తో పోలిస్తే మనం బెటరేనని పేర్కొన్నారు. డెట్ టు జీడీపీ రేషియో 18.7, డెట్ సర్వీస్ రేషియో 6.7, ఫారిన్ రిజర్వు టు ఎక్స్‌టర్నల్ రేషియో 97.4 శాతంగా ఉన్నాయని తెలిపారు. నిరుడుతో పోలిస్తే 2024, మార్చికి విదేశీ అప్పులు 6.4% పెరిగి $663.8bnకు చేరాయి. ఇందులో 31.5% రూపీ ఆధారిత అప్పులే.

Similar News

News November 8, 2025

ఐదో టీ20: భారత్ ఫస్ట్ బ్యాటింగ్

image

భారత్‌తో జరుగుతోన్న ఐదో టీ20లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తిలక్‌కు రెస్ట్ ఇచ్చి అతని స్థానంలో రింకూ సింగ్‌ను జట్టులోకి తీసుకున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు.

IND: అభిషేక్, గిల్, సూర్య(C), రింకూ సింగ్, జితేష్, సుందర్, దూబే, అక్షర్, అర్ష్‌దీప్, వరుణ్, బుమ్రా
AUS: మార్ష్ (C), షార్ట్, ఇంగ్లిస్, డేవిడ్, ఫిలిప్, స్టొయినిస్, మ్యాక్స్‌వెల్, డ్వార్షుయిస్, బార్ట్‌లెట్, ఎల్లిస్, జంపా

News November 8, 2025

అణ్వాయుధ దేశంగా పాక్.. ఇందిర నిర్ణయమే కారణం: మాజీ CIA

image

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ నిర్ణయం వల్లే పాక్ అణ్వాయుధ దేశంగా మారిందని US CIA మాజీ ఆఫీసర్ రిచర్డ్ బార్లో వెల్లడించారు. ‘భారత్, ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ చేసి ఇస్లామాబాద్‌ కహుతా అణు తయారీ కేంద్రంపై దాడికి సిద్ధమయ్యాయి. దీనికి అప్పటి ప్రధాని ఇందిర అంగీకరించలేదు. ఈ దాడి జరిగి ఉంటే చాలా సమస్యలు పరిష్కారమయ్యేవి. పాక్ అణ్వాయుధాలు తయారు చేసేది భారత్‌‌ను ఎదుర్కొనేందుకే’ అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News November 8, 2025

₹5,942 కోట్లతో సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టు: లోకేశ్

image

TGకి చెందిన ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ ₹5,942 కోట్లతో దేశంలోనే రెండో అతిపెద్ద సోలార్ సెల్, మాడ్యూళ్ల ప్రాజెక్టును ఏర్పాటు చేస్తోందని మంత్రి లోకేశ్ వెల్లడించారు. దీనికోసం 2005లో నాయుడుపేట ఇండస్ట్రీయల్ పార్కులో 269 ఎకరాలు కేటాయించామన్నారు. 5GW సిలికాన్ ఇంగోట్, 4GW టాప్‌కాన్ సోలార్ సెల్ యూనిట్లు నెలకొల్పుతారని చెప్పారు. వీటిని 7GWకి విస్తరిస్తారన్నారు. దీనిద్వారా 3500మందికి ఉపాధి లభిస్తుందని తెలిపారు.