News September 26, 2024
కంఫర్ట్ జోన్‌లోనే భారత్ అప్పులు: నిర్మల
భారత్ అప్పులన్నీ కంఫర్ట్ జోన్‌లోనే ఉన్నాయని FM నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రపంచంలోని చాలా మిడిల్ ఇన్‌కం కంట్రీస్‌తో పోలిస్తే మనం బెటరేనని పేర్కొన్నారు. డెట్ టు జీడీపీ రేషియో 18.7, డెట్ సర్వీస్ రేషియో 6.7, ఫారిన్ రిజర్వు టు ఎక్స్‌టర్నల్ రేషియో 97.4 శాతంగా ఉన్నాయని తెలిపారు. నిరుడుతో పోలిస్తే 2024, మార్చికి విదేశీ అప్పులు 6.4% పెరిగి $663.8bnకు చేరాయి. ఇందులో 31.5% రూపీ ఆధారిత అప్పులే.
Similar News
News October 10, 2024
KCRను దెయ్యం అని తెలంగాణ ద్రోహులే అంటారు: హరీశ్
TG: CM రేవంత్ అందజేసిన డీఎస్సీ నియామకపత్రాలు కేసీఆర్ చలవేనని హరీశ్ రావు అన్నారు. 2014లో కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే తెలంగాణను అమ్మేసేవారని, కేసీఆర్ చేతిలో తెలంగాణ సురక్షితంగా ఉంది కాబట్టే ఇవాళ రేవంత్ సీఎం అయ్యారని చెప్పారు. KCRను దెయ్యం అని తెలంగాణ ద్రోహులు తప్ప ఎవరూ అనరని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి ఇవాళ టీచర్లకు నీతివాక్యాలు చెబుతున్నారని ఎద్దేవా చేశారు.
News October 9, 2024
PHOTO: ‘సార్ పుణ్యమా అంటూ DSCలో జాబ్ వచ్చింది’ అని దండం
TG: డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా ఎంపికైన కొత్త టీచర్లకు ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామకపత్రాలు అందజేశారు. ‘సార్ పుణ్యమా అంటూ డీఎస్సీలో జాబ్ వచ్చింది’ అంటూ ఓ వ్యక్తి ఎల్బీ స్టేడియంలోని సీఎం ఫ్లెక్సీకి దండం పెట్టారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
News October 9, 2024
కేంద్రం బ్యాన్ చేసిన యాప్.. ఎన్నికల సంఘం వాడుతోంది!
కేంద్రం 2020లో 59 చైనా యాప్స్‌ను బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. డాక్యుమెంట్లను కెమెరాతో స్కాన్ చేసి పీడీఎఫ్ ఫైల్స్‌లా సేవ్ చేసుకునేందుకు ఉపకరించే క్యామ్‌స్కానర్ కూడా వాటిలో ఉంది. దీన్నుంచి కూడా చైనాకు సమాచారం వెళ్తోందన్న ఆరోపణలున్నాయి. అలాంటి ఈ యాప్‌ను స్వయంగా కేంద్ర ఎన్నికల సంఘమే వాడుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఓ నెటిజన్ ఈ విషయాన్ని గుర్తించి పోస్ట్ పెట్టగా దానిపై చర్చ జరుగుతోంది.