News September 26, 2024

ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ జిల్లా అధ్యక్షుల నియామకం

image

ఉమ్మడి విశాఖ జిల్లాలోని వైసీపీ అధ్యక్షులను పార్టీ అధిష్ఠానం గురువారం నియమించింది. విశాఖకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ను, అనకాపల్లి జిల్లాకు మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడిని నియమించింది. అటు అల్లూరి జిల్లా వైసీపీ అధ్యక్షునిగా పాడేరు MLA విశ్వేశ్వర రాజుకి బాధ్యతలు అప్పగించారు. మరో వైపు విశాఖ వెస్ట్ ఇన్‌ఛార్జ్‌గా మళ్లా విజయప్రసాద్‌ను నియమించారు.

Similar News

News January 15, 2026

విశాఖలో డాగ్ స్క్వాడ్‌తో తనిఖీలు

image

విశాఖ సీపీ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు గంజాయి అక్రమ రవాణాను పూర్తిగా అరికట్టేందుకు డాగ్ స్క్వాడ్ సహాయంతో నగరంలో గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఆర్టీసీ కాంప్లెక్స్, రైల్వే స్టేషన్, కొరియర్ కార్యాలయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ విశాఖలో నిరంతర నిఘా కొనసాగించారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు రవాణా కాకుండా ప్రజల భద్రత, యువత భవిష్యత్తు, రక్షణే లక్ష్యంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

News January 15, 2026

సింహాచలంలో 18న అప్పన్న తెప్పోత్సవం

image

వరాహ లక్ష్మీనృసింహ స్వామి వారి తెప్పోత్సవం ఈ నెల 18న (ఆదివారం) వరాహ పుష్కరిణిలో వైభవంగా జరగనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు కొండపై నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు తెప్పోత్సవం నిర్వహిస్తారు. అనంతరం గ్రామ తిరువీధి ఉత్సవం జరగనుంది. ఉత్సవం కారణంగా ఆ రోజు సాయంత్రం 6 గంటల వరకే భక్తులకు స్వామివారి దర్శనం లభిస్తుందని ఆలయ అధికారులు తెలిపారు.

News January 15, 2026

గాజువాక: లారీ ఢీకొట్టి వ్యక్తి మృతి

image

గాజువాక వడ్లపూడి జంక్షన్ ఆటోనగర్ వెళ్లే రహదారిలో లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన నిన్న రాత్రి జరిగింది. వడ్లపూడిలో నివాసం ఉంటున్న చింత సంతోష్ కుమార్ ఇంటికి వెళ్ళటానికి రోడ్డు దాటుతుండగా కూర్మన్నపాలెం నుంచి గాజువాక వైపు వేగంగా వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సంతోష్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. దువ్వాడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.