News September 27, 2024

హైకోర్టుకు గజ్జల లక్ష్మి.. తీర్పు రిజర్వు

image

AP: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా తన నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేయడం పట్ల గజ్జల లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం తనను తొలగించారని కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డారని, ఆగస్టుతో పదవీ కాలం ముగిసిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు. వాదనల అనంతరం తీర్పును కోర్టు రిజర్వు చేసింది.

Similar News

News September 27, 2024

MBBS కన్వీనర్ కోటా ప్రవేశాలకు వెబ్ ఆప్షన్లు

image

TG: రాష్ట్రంలో MBBS ప్రవేశాల కోసం వెబ్‌ఆప్షన్ ప్రక్రియ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ ప్రకటించింది. ఈ రోజు ఉ.6గంటల నుంచి ఈ నెల 29వ తేదీ సా.6గంటలకు వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం ఉంటుంది. కన్వీనర్ కోటా కింద దివ్యాంగులు, EWS, PMC, సైనిక ఉద్యోగుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు. వెబ్ ఆప్షన్ల కోసం tspvtmedadm.tsche.inను సందర్శించాలి.

News September 27, 2024

₹10,000 కోట్లతో స్విగ్గీ IPO

image

ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ గురువారం సెబీ వద్ద IPO పేపర్లను సబ్మిట్ చేసింది. ₹10వేల కోట్ల విలువతో వస్తోంది. పేటీఎం (₹18,300 కోట్లు) తర్వాత భారత్‌లో అత్యంత విలువైన స్టార్టప్ IPO ఇదే. వచ్చే వారం షేర్‌హోల్డర్ల మీటింగ్ తర్వాత ఈ విలువను ₹11,700 కోట్లకు పెంచుతారని అంచనా. ఫ్రెష్ ఇష్యూ ద్వారా ₹3750 కోట్లు, OFS ద్వారా మిగిలిన డబ్బును సమీకరిస్తారు. స్విగ్గీ రైవల్ జొమాటో ₹9,375 కోట్లతో IPOకు వచ్చింది.

News September 27, 2024

నేడు ‘ప్రవాసీ ప్రజావాణి’ ప్రారంభం

image

TG: విదేశాల్లో పనిచేసే కార్మికుల సమస్యలను వారి కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకునేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా HYDలోని ప్రజాభవన్‌లో ‘ప్రవాసీ ప్రజావాణి’ కోసం ప్రత్యేక కౌంటర్‌ను మంత్రి పొన్నం ప్రభాకర్ నేడు ప్రారంభించనున్నారు. ఇది ప్రవాసీ కార్మికులకు, కేంద్ర ప్రభుత్వానికి, భారత రాయబార కార్యాలయాలకు మధ్య ఒక వారధిలా ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.