News September 27, 2024
హైకోర్టుకు గజ్జల లక్ష్మి.. తీర్పు రిజర్వు
AP: రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా తన నియామకాన్ని ప్రభుత్వం రద్దు చేయడం పట్ల గజ్జల లక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. 2026 వరకు రాజ్యాంగబద్ధ హోదాలో పదవీకాలం ఉన్నప్పటికీ రాజకీయ ప్రయోజనాల కోసం తనను తొలగించారని కోర్టుకు తెలిపారు. అయితే పిటిషనర్ కేవలం పరిమిత కాలానికి మాత్రమే నియమించబడ్డారని, ఆగస్టుతో పదవీ కాలం ముగిసిందని ప్రభుత్వ తరఫు న్యాయవాది అన్నారు. వాదనల అనంతరం తీర్పును కోర్టు రిజర్వు చేసింది.
Similar News
News October 5, 2024
రేపు ఢిల్లీకి రేవంత్.. సీఎంల భేటీకి హాజరు
TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. తీవ్రవాద నిరోధంపై కేంద్ర హోంశాఖ నిర్వహించనున్న అన్ని రాష్ట్రాల సీఎంలు, హోంమంత్రుల సమావేశానికి హాజరై ప్రసంగిస్తారు. పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశం ఉంది. ఇటీవల వరదల పరిహారంగా కేంద్రం రూ.500 కోట్లు ఇవ్వగా, మరింత సాయం చేయాలని నివేదించనున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలనూ సీఎం కలవొచ్చని అధికార వర్గాలు వెల్లడించాయి.
News October 5, 2024
టీ20 WC: భారత్ సెమీస్ చేరాలంటే?
మహిళల టీ20 WCలో నిన్న కివీస్ చేతిలో ఓడిన టీమ్‌ఇండియా -2.900 NRRతో గ్రూప్-Aలో చివరి స్థానంలో ఉంది. సెమీస్ చేరాలంటే మిగతా 3 మ్యాచులు (PAK, SL, AUS) గెలవడంతో పాటు బెటర్ రన్ రేట్ సాధించాలి. లేదంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి వస్తుంది. బలమైన AUS టీమ్ ఎలాగో SFకి చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. భారత్ SF చేరాలంటే AUS మినహా మిగతా 3 జట్లు రెండేసి మ్యాచులు ఓడాలి. వాటి NRR మనకంటే తక్కువుండాలి.
News October 5, 2024
హృతిక్, ఎన్టీఆర్‌తో సాంగ్ షూట్.. అప్పుడేనా?
జూ.ఎన్టీఆర్ ఈనెల 9 నుంచి ‘వార్-2’ సినిమా షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు సమాచారం. ఈనెల మూడో వారంలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్‌తో ఒక సాంగ్‌ను షూట్ చేయనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్ ఈ పాటకు పని చేస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీని వచ్చే ఏడాది ఆగస్టు 14న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.