News September 27, 2024
ప్రాచుర్యం కోసమే బంగ్లా ఫ్యాన్ ఓవరాక్షన్?

INDvBAN 2వ టెస్టులో బంగ్లా అభిమాని ఒకరు కుప్పకూలిన సంగతి తెలిసిందే. కేవలం అనారోగ్యంతోనే పడిపోయినా, సంచలనం సృష్టించి వార్తల్లోకి వచ్చేందుకే భారత అభిమానులు దాడి చేసినట్లు అతడు ఆరోపించాడని రెవ్‌స్పోర్ట్జ్ అనే వెబ్ సైట్ తెలిపింది. బీసీసీఐ అధికారి ఒకరు తమతో అతడి గురించి చెప్పినట్లు స్పష్టం చేసింది. కాగా.. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో సైతం స్థానికులు తనను తిట్టినట్లు అతడు ఆరోపించాడు.
Similar News
News November 10, 2025
MBNR: ఈనెల 12న చెస్ ఎంపికలు.. ఎస్‌జీఎఫ్ ప్రకటన

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14, 17, 19 బాల, బాలికల విభాగాల్లో చెస్ ఎంపికలను నిర్వహించనున్నారు. ఈ నెల 12న మహబూబ్‌నగర్‌లోని లిటిల్ స్కాలర్ స్కూల్‌లో ఎంపికలు జరుగుతాయని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. అభ్యర్థులు ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్, టెన్త్ మెమో (U-19)తో ఉదయం 9 గంటలలోపు రిపోర్ట్ చేయాలని ఆమె సూచించారు.
News November 10, 2025
వాళ్లు మూల్యం చెల్లించాల్సిందే: లోకేశ్

AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ‘సిట్’ నిజాన్ని బట్టబయలు చేసిందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. ‘కల్తీ నెయ్యి కేసులో దోషులకు కఠిన శిక్షలు తప్పవు. ఇది కల్తీ కాదు.. హిందువుల నమ్మకం, భారత దేశ ఆత్మవిశ్వాసంపై ఉద్దేశపూర్వకంగా చేసిన దాడి. తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వాళ్లు తప్పక మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఓం నమో వేంకటేశాయ’ అని ట్వీట్ చేశారు.
News November 10, 2025
మీకు ఇలాంటి కాల్స్ వస్తున్నాయా?

తాము టెలికాం శాఖ అధికారులమని చెప్పి సైబర్ నేరగాళ్లు సామాన్యులను మోసం చేస్తున్నారు. ‘మీ ఫోన్ నంబర్-ఆధార్ లింక్ కాలేదు. మేం చెప్పినట్లు చేయకపోతే మీ నంబర్ బ్లాక్ చేస్తాం’ అంటూ బెదిరిస్తున్నారు. వివరాలు చెప్పగానే ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. అయితే టెలికాం శాఖ అలాంటి కాల్స్ చేయదని, ఎవరూ భయపడొద్దని PIB Fact Check స్పష్టం చేసింది. cybercrime.gov.in లేదా 1930కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించింది.


