News September 27, 2024

ప్రాచుర్యం కోసమే బంగ్లా ఫ్యాన్ ఓవరాక్షన్?

image

INDvBAN 2వ టెస్టులో బంగ్లా అభిమాని ఒకరు కుప్పకూలిన సంగతి తెలిసిందే. కేవలం అనారోగ్యంతోనే పడిపోయినా, సంచలనం సృష్టించి వార్తల్లోకి వచ్చేందుకే భారత అభిమానులు దాడి చేసినట్లు అతడు ఆరోపించాడని రెవ్‌స్పోర్ట్జ్ అనే వెబ్ సైట్ తెలిపింది. బీసీసీఐ అధికారి ఒకరు తమతో అతడి గురించి చెప్పినట్లు స్పష్టం చేసింది. కాగా.. చెన్నైలో జరిగిన తొలి టెస్టులో సైతం స్థానికులు తనను తిట్టినట్లు అతడు ఆరోపించాడు.

Similar News

News July 9, 2025

ఇవాళ భారీ వర్షాలు: వాతావరణ కేంద్రం

image

TG: రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మంచిర్యాల, నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, హైదరాబాద్, కామారెడ్డి, MBNR జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. పూర్తి లిస్ట్ కోసం <>క్లిక్<<>> చేయండి.

News July 9, 2025

ఆధార్ తొలి గుర్తింపు కాదు: భువనేశ్

image

బిహార్‌ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో నకిలీ ఓట్లను గుర్తించేందుకు ఆధార్‌ను అనుసంధానించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. కాగా ఆధార్ కేవలం ఒక ధ్రువీకరణ మాత్రమేనని, అర్హతకు ప్రాథమిక ఆధారం లేదా గుర్తింపు కాదని UIDAI CEO భువనేశ్ కుమార్ స్పష్టం చేశారు. అటు ఫేక్ ఆధార్ కార్డుల కట్టడికీ మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిపారు. నకిలీ ఆధార్‌లను గుర్తించే QR కోడ్ స్కానర్ యాప్ అభివృద్ధి చివరి దశలో ఉందన్నారు.

News July 9, 2025

సామ్‌తో రాజ్.. శ్యామలి ఇంట్రెస్టింగ్ పోస్ట్

image

హీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు డేటింగ్‌లో ఉన్నారనే పుకార్ల వేళ వీరిద్దరూ కలిసి ఉన్న <<17000941>>ఫొటో<<>> వైరలైన విషయం తెలిసిందే. ఈక్రమంలో రాజ్ సతీమణి శ్యామలి ఇన్‌స్టా స్టోరీలో ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. ‘ఏ మతమైనా మన చర్యలతో ఇతరులను బాధించొద్దని చెబుతుంది. అదే మనం పాటించాల్సిన గొప్ప నియమం’ అని రాసున్న కొటేషన్‌ను ఆమె పంచుకున్నారు. ప్రస్తుతం ఈ పోస్ట్ చర్చనీయాంశమైంది.