News September 27, 2024
జొమాటోకి సహ వ్యవస్థాపకురాలి రాజీనామా

జొమాటో సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రా సంస్థలో పదవికి రిజైన్ చేశారు. 13 ఏళ్ల పాటు ఆమె జొమాటోకు సేవలందించారు. స్టాక్ ఎక్స్ఛేంజీకి సంస్థ ఈరోజు ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో సీనియర్ మేనేజర్‌గా, తర్వాత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. అవసరం ఉన్నప్పుడు ఒక కాల్ చేస్తే చాలని రాజీనామా లేఖలో ఆమె పేర్కొనడం ఆసక్తికరం.
Similar News
News January 23, 2026
వర్సిటీల నిధులు, నియామకాలపై PUC ఛైర్మన్ సమీక్ష

రాష్ట్రంలో ఉన్నత విద్యారంగాన్ని బలోపేతం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని PUC ఛైర్మన్ కూన రవికుమార్ తెలిపారు. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో అంబేడ్కర్ యూనివర్సిటీ, JNTU విజయనగరం, IIIT శ్రీకాకుళం యూనివర్సిటీల నిధుల వినియోగం, నియామకాలు, ఆదాయ-వ్యయాలు, పరిపాలనా పనితీరుపై సమీక్షించారు. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు పూర్తిగా విద్యార్థుల మేలు కోసం వినియోగించాలన్నారు.
News January 23, 2026
2 వారాలు షుగర్ మానేస్తే మ్యాజిక్ రిజల్ట్స్!

స్వీట్లు, కూల్ డ్రింక్స్ వంటి వాటిలోని చక్కెర మన బాడీని పాడు చేస్తోందని ఎయిమ్స్ డాక్టర్ సౌరభ్ సేథి చెప్పారు. కేవలం 14 రోజులు షుగర్ మానేస్తే అద్భుతమైన మార్పులు వస్తాయన్నారు. ‘ముఖంలో వాపు తగ్గి గ్లో వస్తుంది. ఇన్సులిన్ లెవల్స్ తగ్గి పొట్ట ఫ్లాట్‌గా మారుతుంది. ఫ్యాటీ లివర్ రిస్క్ తగ్గి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు మాయమవుతాయి. హెల్తీ స్కిన్ కోసం ఇదో బెస్ట్ టిప్’ అని సూచించారు.
News January 23, 2026
స్పేస్ అప్లికేషన్ సెంటర్‌లో 49 పోస్టులకు నోటిఫికేషన్

అహ్మదాబాద్‌లోని <


