News September 27, 2024

జొమాటోకి సహ వ్యవస్థాపకురాలి రాజీనామా

image

జొమాటో సహ వ్యవస్థాపకురాలు ఆకృతి చోప్రా సంస్థలో పదవికి రిజైన్ చేశారు. 13 ఏళ్ల పాటు ఆమె జొమాటోకు సేవలందించారు. స్టాక్ ఎక్స్ఛేంజీకి సంస్థ ఈరోజు ఈ విషయాన్ని వెల్లడించింది. ఆమె ఫైనాన్స్ అండ్ ఆపరేషన్స్ విభాగంలో సీనియర్ మేనేజర్‌గా, తర్వాత చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా, చీఫ్ పీపుల్ ఆఫీసర్‌గా విధులు నిర్వర్తించారు. అవసరం ఉన్నప్పుడు ఒక కాల్ చేస్తే చాలని రాజీనామా లేఖలో ఆమె పేర్కొనడం ఆసక్తికరం.

Similar News

News October 13, 2024

ఇసుక ధరలు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?: జగన్

image

AP: భరించలేని ఇసుక రేట్లతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని మాజీ సీఎం జగన్ విమర్శించారు. ‘మా ప్రభుత్వంలో రాష్ట్ర ఖజానాకు కనీసం డబ్బులైనా వచ్చేవి, ఇప్పుడు అది కూడా లేదు. పేరుకే ఉచితం కానీ వ్యవహారం అంతా చంద్రబాబు, ఆయన ముఠా మీదుగా నడుస్తోంది. మేము టన్ను ఇసుక రూ.475కు సరఫరా చేశాం. ఇందులో నేరుగా రూ.375 ఖజానాకు వచ్చేవి. మా హయాంలో కన్నా రేట్లు 2-3 రెట్లు ఎందుకు పెరిగాయి?’ అని జగన్ ట్వీట్ చేశారు.

News October 13, 2024

అల్పపీడనం.. భారీ నుంచి అతిభారీ వర్షాలు

image

AP: దక్షిణ బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. అది 48 గంటల్లో బలపడి ఉత్తర తమిళనాడు, దక్షిణ కోస్తా తీరాలవైపు కదిలే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో బుధ, గురువారాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. అటు తమిళనాడులోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు.

News October 13, 2024

త్వరలో మరో పార్టీలో చేరుతా: రాపాక

image

AP: వైసీపీని వీడనున్నట్లు రాజోలు మాజీ ఎమ్మెల్యే <<14347126>>రాపాక<<>> వరప్రసాద్ తెలిపారు. వైసీపీలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. ‘గతంలో పార్టీ చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని నూరు శాతం నిర్వహించా. అయినా ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వలేదు. TDP నుంచి వచ్చిన గొల్లపల్లి సూర్యారావుకు ఇచ్చారు. ఇప్పుడు ఆయననే ఇన్‌ఛార్జ్‌గానూ నియమించారు. ఇష్టం లేకపోయినా MPగా పోటీ చేశా. త్వరలో మరో పార్టీలో చేరుతా’ అని మీడియాకు వెల్లడించారు.