News September 28, 2024

సెప్టెంబర్ 28: చరిత్రలో ఈరోజు

image

1895: తెలుగు ప్రసిద్ధ కవి గుర్రం జాషువా జననం
1907: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జననం
1909: నటుడు, నిర్మాత పైడి జైరాజ్ జననం
1929: గాన కోకిల లతా మంగేష్కర్ జననం
1966: పూరీ జగన్నాథ్ జననం
1982: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ జననం
1895: ప్రముఖ జీవశాస్త్రవేత్త లూయిూ పాశ్చర్ మరణం
>>అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం
>>ప్రపంచ రేబిస్ దినోత్సవం

Similar News

News September 28, 2024

నేడు హైదరాబాద్‌కు రాష్ట్రపతి

image

TG: నల్సార్ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేడు HYD రానున్నారు. ఆమె పర్యటన సందర్భంగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్‌గా మంత్రి సీతక్కను ప్రభుత్వం నియమించింది. ముర్ముకు స్వాగతం పలకడం నుంచి ఆమె తిరిగి వెళ్లే వరకు సీతక్క రాష్ట్రపతి వెంటే ఉండనున్నారు. బేగంపేట, HPS, PNT జంక్షన్‌, రసూల్‌పురా, CTO ప్లాజా, లోతుకుంట, బొల్లారం రాష్ట్రపతి నిలయం ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలుంటాయి.

News September 28, 2024

సీఎం పర్యటనల కోసం అడ్వాన్స్ టీమ్స్ ఏర్పాటు

image

ఏపీ వ్యాప్తంగా సీఎం చంద్రబాబు పర్యటనల ముందస్తు ఏర్పాట్ల కోసం రెండు అడ్వాన్స్ టీమ్స్‌ను ప్రభుత్వం నియమించింది. రెవెన్యూ, పోలీస్, సమాచార, ప్రణాళిక శాఖలకు చెందిన అధికారులు ఈ బృందాల్లో ఉంటారు. వీరు చేయాల్సిన పనులపై ప్రభుత్వం మార్గదర్శకాలు సైతం విడుదల చేసింది. సీఎం పర్యటనలకు 24 గంటల ముందు ఈ బృందాలు క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేస్తాయి.

News September 28, 2024

హైందవేతరుల కోసం తిరుమలలో బోర్డుల ఏర్పాటు

image

AP: తిరుమల శ్రీవారి దర్శనం కోసం వచ్చే హైందవేతరులు పాటించాల్సిన నిబంధనల గురించి TTD బోర్డులు ఏర్పాటు చేసింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ATC సర్కిల్, గోకులం వద్ద బోర్డులు పెట్టింది. హైందవేతరులు ఆలయ ప్రవేశం చేయాలనుకుంటే శ్రీవారి పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నట్లు ధ్రువీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. తిరుమలలోని వైకుంఠం క్యూకాంప్లెక్స్, అన్ని ఉప విచారణ కార్యాలయాల్లో పత్రాలు అందుబాటులో ఉంటాయంది.