News September 28, 2024

సెప్టెంబర్ 28: చరిత్రలో ఈరోజు

image

1895: తెలుగు ప్రసిద్ధ కవి గుర్రం జాషువా జననం
1907: స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ జననం
1909: నటుడు, నిర్మాత పైడి జైరాజ్ జననం
1929: గాన కోకిల లతా మంగేష్కర్ జననం
1966: పూరీ జగన్నాథ్ జననం
1982: బాలీవుడ్ నటుడు రణ్‌బీర్ కపూర్ జననం
1895: ప్రముఖ జీవశాస్త్రవేత్త లూయిూ పాశ్చర్ మరణం
>>అంతర్జాతీయ సమాచార హక్కుల దినోత్సవం
>>ప్రపంచ రేబిస్ దినోత్సవం

Similar News

News October 5, 2024

మూసీ నిర్వాసితుల కోసం ప్రత్యేక కమిటీ

image

TG: మూసీ నిర్వాసితుల జీవనోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. సెర్ప్ సీఈవో ఛైర్మన్‌గా 14 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. అటు మూసీ నిర్వాసితులకు ఇప్పటికే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.

News October 5, 2024

జెర్రి పడిందన్నది అవాస్తవం.. నమ్మొద్దు: TTD

image

తిరుమల అన్నప్రసాదంలో జెర్రి కనిపించిందంటూ వస్తున్న ఆరోపణల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ఖండించింది. అవి అవాస్తవాలని తేల్చిచెప్పింది. ‘వేలాదిమందికి వడ్డించేందుకు ప్రసాదాన్ని తయారుచేస్తారు. అంత వేడిలో ఓ జెర్రి ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉందనడం ఆశ్చర్యకరం. ఇది కావాలని చేసిన చర్యగా భావించాల్సి వస్తోంది. దయచేసి భక్తులు ఇలాంటి వార్తల్ని నమ్మొద్దని టీడీపీ విజ్ఞప్తి చేస్తోంది’ అని ఓ ప్రకటనలో కోరింది.

News October 5, 2024

Exit Polls: బీజేపీకి ప్ర‌తికూల ఫ‌లితాలు

image

JK, హ‌రియాణా ఎన్నిక‌ల్లో BJPకి ప్ర‌తికూల ఫ‌లితాలు తప్పవని ఎగ్జిట్ పోల్స్ అంచ‌నా వేశాయి. 90 స్థానాలున్న JKలో BJP సాధించే సీట్లపై సర్వే అంచనాలు. *పీపుల్స్ పల్స్ 23-27 *దైనిక్ భాస్క‌ర్ 20-25 *గ‌లిస్తాన్ News 28-30 *India Today/CVoter 27-32. హరియాణా: పీపుల్స్ పల్స్ 26 *దైనిక్ భాస్కర్ 19-29 *మ్యాట్రిజ్ 18-24 * ధ్రువ్ రీసెర్చ్ 27-32. BJP రెండు చోట్లా మెజారిటీ మార్క్ సాధించలేదని సర్వేలు తేల్చాయి.