News September 29, 2024
అబద్ధాలతో ఆవలిస్తున్నావా జగన్?: TDP

AP: తిరుమల లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో వేర్వేరుగా మాట్లాడిన <<14226275>>వీడియోను<<>> షేర్ చేసిన జగన్‌కు TDP కౌంటరిచ్చింది. ‘మొన్న పడుకొని ఇప్పుడు నిద్రలేచి మళ్లీ అబద్ధాలతో ఆవలిస్తున్నావా జగన్? తప్పు చేసి కొండమీదకు రావడానికి వణుకు వచ్చి పోలీసుల మీద అబద్ధాలను చెప్పావు. మొన్నే నువ్వు చూపించిన ఈ వీడియోల మీద మేం స్పందించాం. వెళ్లి చూడు ఫేకు కుంభకర్ణా’ అని Xలో రాసుకొచ్చింది.
Similar News
News September 16, 2025
OTTలోకి ‘వార్-2’ వచ్చేది అప్పుడేనా?

హృతిక్ రోషన్, Jr.NTR నటించిన ‘వార్-2’ సినిమా ఈ నెల 25 నుంచి అక్టోబర్ 9 మధ్య ఓటీటీ(నెట్‌ఫ్లిక్స్)లో రిలీజయ్యే అవకాశం ఉంది. థియేట్రికల్ టు డిజిటల్ విండో ప్రకారం 6-8 వారాల్లో సినిమాలు OTTలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న థియేటర్లలో విడుదలైన ఈ మూవీ కూడా అదే ఫార్ములా ఫాలో అయ్యే ఛాన్స్ ఉందని సినీ వర్గాలు పేర్కొన్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ మూవీని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేశారు.
News September 16, 2025
విగ్రహం వ్యవహారం.. భూమనపై కేసు నమోదు

AP: వైసీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన <<17725838>>కరుణాకర్<<>> రెడ్డిపై కేసు నమోదైంది. భూమన శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని టీటీడీ డిప్యూటీ ఈవో ఫిర్యాదుతో అలిపిరి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా తిరుమలలో విష్ణుమూర్తి విగ్రహానికి అపచారం జరిగిందని భూమన ఆరోపించారు. అయితే అది విష్ణు విగ్రహం కాదని శనీశ్వరుడి విగ్రహం అని <<17730080>>ఏపీ ఫ్యాక్ట్‌చెక్<<>> స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
News September 16, 2025
పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎందుకు పిరికివాళ్లుగా మారారు: KTR

TG: పార్టీ మారిన MLAలు ఎన్ని తమాషాలు చేసినా ఉప ఎన్నికలు తప్పవని KTR అన్నారు. వాళ్లు ఎందుకు పిరికివాళ్లుగా మారిపోయారో చెప్పాలన్నారు. ‘రేవంత్ చేతిలో మోసపోవడంలో ప్రజల తప్పు లేదు. కాంగ్రెస్ మోసాన్ని ప్రజలకు వివరించడంలో మేం విఫలమయ్యాం. చేసిన మంచిని, అభివృద్ధిని చెప్పుకోలేకపోయాం. ఆ రోజే కాంగ్రెస్ దొంగ పార్టీ అని వివరిస్తే బాగుండేది. INCకి దమ్ముంటే ఉపఎన్నికకు వెళ్లాలి’ అని పేర్కొన్నారు.