News September 29, 2024

అబద్ధాలతో ఆవలిస్తున్నావా జగన్?: TDP

image

AP: తిరుమల లడ్డూ వివాదంలో సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో వేర్వేరుగా మాట్లాడిన <<14226275>>వీడియోను<<>> షేర్ చేసిన జగన్‌కు TDP కౌంటరిచ్చింది. ‘మొన్న పడుకొని ఇప్పుడు నిద్రలేచి మళ్లీ అబద్ధాలతో ఆవలిస్తున్నావా జగన్? తప్పు చేసి కొండమీదకు రావడానికి వణుకు వచ్చి పోలీసుల మీద అబద్ధాలను చెప్పావు. మొన్నే నువ్వు చూపించిన ఈ వీడియోల మీద మేం స్పందించాం. వెళ్లి చూడు ఫేకు కుంభకర్ణా’ అని Xలో రాసుకొచ్చింది.

Similar News

News October 5, 2024

నేనిప్పుడు గాంధేయవాదిని: ఉగ్రవాది యాసిన్ మాలిక్

image

తాను 1994 నుంచే హింసను వదిలేశానని, ఇప్పుడు గాంధేయవాదినని ఉగ్రవాది, వేర్పాటువాది యాసిన్ మాలిక్ చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం(UAPA) ట్రిబ్యునల్‌కు తెలిపారు. శాంతియుత విధానాల్లోనే స్వతంత్ర, ఐక్య కశ్మీర్‌ను సాధించాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. మాలిక్ ప్రస్తుతం తిహార్‌ జైల్లో జీవిత ఖైదు అనుభవిస్తున్నారు. 1990లో భారత వాయుసేనకు చెందిన నలుగురు అధికారుల హత్యలో మాలిక్ ప్రధాన నిందితుడు.

News October 5, 2024

అత్యంత అరుదైన ఖగోళ దృశ్యం.. మళ్లీ 80వేల ఏళ్ల తర్వాతే!

image

మరికొన్ని రోజుల్లో ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. సుచిన్‌షాన్-అట్లాస్ అనే తోకచుక్క భూమికి 44 మిలియన్ మైళ్ల దూరం నుంచి వెళ్లనుందని నాసా వెల్లడించింది. 2023లో సూర్యుడికి అత్యంత సమీపంగా ప్రయాణించినప్పుడు దీన్ని తొలిసారి గుర్తించామని పేర్కొంది. ఈ నెల 9-10 తేదీల మధ్య స్పష్టంగా కనిపించే అవకాశం ఉందని వివరించింది. ఈ తోకచుక్క భూమి సమీపానికి మళ్లీ వచ్చేది మరో 80వేల సంవత్సరాల తర్వాతే!

News October 5, 2024

హర్షసాయి‌పై లుక్‌అవుట్ నోటీసులు

image

TG: అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి కోసం HYD నార్సింగి పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. అతడిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేశారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేశాడని, రూ.2 కోట్ల డబ్బు కూడా తీసుకున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.