News September 30, 2024

రూ.7,200 కోట్లివ్వండి.. కేంద్రానికి రాష్ట్రం లేఖ

image

AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నవంబర్ నుంచి పనులు ప్రారంభించి ఒకే సీజన్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ నిధులు విడుదల చేస్తే పోలవరం హెడ్ వర్క్స్ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది.

Similar News

News September 30, 2024

‘బురారీ’ తరహాలోనే తండ్రి, నలుగురు కూతుళ్లు ఆత్మహత్య!

image

2018లో ఢిల్లీ బురారీలోని ఇంట్లో 11 మంది ఆత్మహత్య చేసుకోవడం సంచలనమైంది. తాజాగా దేశ రాజధానిలోని వసంత్‌కుంజ్‌లో తండ్రి, నలుగురు కూతుళ్లు సూసైడ్ చేసుకున్నారు. ఇది కూడా బురారీ ఘటన తరహాలో తాంత్రిక పూజల్లో భాగంగానే జరిగిందనే అనుమానాలొస్తున్నాయి. వారి మెడ, మణికట్టుకు ఎరుపు, పసుపు దారాలను పోలీసులు గుర్తించారు. వారంతా విషం కలిపిన స్వీట్లను తిన్నట్లు తేల్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

News September 30, 2024

అందుకే T20లకు రిటైర్మెంట్ ప్రకటించా: రోహిత్

image

టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ T20 వరల్డ్ కప్-2024 గెలిచాక ఆ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం వెనకున్న కారణాలను ఆయన తాజాగా వెల్లడించారు. ‘నేను 17 ఏళ్లు ఈ ఫార్మాట్‌ను ఆస్వాదించా. వరల్డ్ కప్​ గెలవడంతో ఇతర వాటిపై కూడా దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయం అనిపించింది. టీమ్ఇండియాలో గొప్ప ప్లేయర్లున్నారు. అందుకే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నా’ అని తెలిపారు.

News September 30, 2024

OTTలోనూ దుమ్మురేపుతోన్న ‘సరిపోదా శనివారం’

image

నాని, ప్రియాంక మోహన్ జంటగా వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఇప్పటికే థియేటర్లలో రూ.100కోట్ల+ కలెక్షన్స్ సాధించిన ఈ చిత్రం ఈనెల 26 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. OTT ప్రేక్షకులను సైతం మెప్పిస్తూ దేశవ్యాప్తంగా నంబర్ 1లో ట్రెండ్ అవుతోందని హీరో నాని ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. కాగా, ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సాలిడ్ మ్యూజిక్ అందించారు.