News September 30, 2024
రూ.7,200 కోట్లివ్వండి.. కేంద్రానికి రాష్ట్రం లేఖ
AP: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్, ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణానికి రూ.7,200 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ఈ నవంబర్ నుంచి పనులు ప్రారంభించి ఒకే సీజన్‌లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఆ నిధులు విడుదల చేస్తే పోలవరం హెడ్ వర్క్స్ పనులకు ఎలాంటి ఆటంకం ఉండదని పేర్కొంది.
Similar News
News October 11, 2024
రేపే ‘విశ్వంభర’ టీజర్ విడుదల!
మెగాఫ్యాన్స్ అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న తరుణం వచ్చేసింది. సోషియో ఫాంటసీ మూవీ ‘విశ్వంభర’ టీజర్‌ను రేపు ఉదయం 10.49కి విడుదల చేయనున్నట్లు ఆ సినిమా డైరెక్టర్ వశిష్ఠ అనౌన్స్ చేశారు. సినీప్రియులు వేడుక చేసుకునేలా మూవీ ఉంటుందని తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి, త్రిష కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజయ్యే అవకాశం ఉంది.
News October 11, 2024
నెట్స్‌లో చెమటోడ్చుతున్న హిట్‌మ్యాన్
న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. గంటలపాటు ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు పుణే, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి.
News October 11, 2024
ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య హెచ్చరికలు, విజ్ఞప్తులు
ఇజ్రాయెల్ దురాక్రమణలకు దిగితే కఠిన చర్యలకు సిద్ధమని ఇరాన్ హెచ్చరించింది. ఇక లెబనాన్ నుంచి ప్రయోగించిన 25 రాకెట్లలో కొన్నింటిని ఇంటర్సెప్ట్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్రకటించింది. మరోవైపు పౌరులు, జనావాసాలపై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాలని లెబనాన్ కోరింది. గురువారం జరిగిన దాడుల్లో 139 పౌరులు మృతి చెందినట్టు తెలిపింది. UN తీర్మానం మేరకు కాల్పుల విరమణకు కట్టుబడి ఉండాలని కోరింది.