News September 30, 2024

జానీ మాస్టర్‌కు దక్కని ఊరట

image

TG: అత్యాచారం కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు ఊరట దక్కలేదు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై విచారణను రంగారెడ్డి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. ఇటీవల ఆయనను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు పలు కీలక అంశాలు రాబట్టినట్లు సమాచారం.

Similar News

News September 13, 2025

విశాఖ బీచ్ రోడ్ – భోగాపురం ఎయిర్‌పోర్టుకు 6 లైన్ల రోడ్డు!

image

AP: విశాఖ బీచ్ రోడ్ నుంచి భీమిలి మీదుగా భోగాపురం ఎయిర్‌పోర్టు వరకు 6 లైన్ల రహదారి నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ప్రస్తుతం కొండల మధ్య నుంచి వెళ్లే పాత మార్గం స్థానంలో వేగవంతమైన రోడ్డుతో అనుసంధానించాలని చూస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో భీమిలి-భోగాపురం గ్రీన్‌ఫీల్డ్ రోడ్డును ప్రతిపాదించారు. ఆ మార్గం స్థానిక రాజకీయ నాయకుల స్థలాలకు అనుకూలంగా ఉందని విమర్శలు వెల్లువెత్తాయి.

News September 13, 2025

బీసీసీఐలో భజ్జీకి కీలక పదవి?

image

భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్‌కు బీసీసీఐలో కీలక పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఆయనను యాన్యువల్ జనరల్ మీటింగ్(ఏజీఎం)లో తమ ప్రతినిధిగా పంజాబ్ నామినేట్ చేసింది. ఈమేరకు ఆయన ఈనెల 28న జరగనున్న ఏజీఎం మీటింగ్‌కు హాజరుకానున్నారు. అందులో బీసీసీఐ ప్రెసిడెంట్‌తో పాటు ఇతర పోస్టులకు సభ్యులను ఎన్నుకునే అవకాశం ఉంది. మరి భజ్జీని ఏ పదవి వరిస్తుందో చూడాలి.

News September 13, 2025

ఫేక్ ప్రచారాలకు త్వరలోనే చెక్: మంత్రి అనిత

image

AP: సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాల నియంత్రణకు త్వరలో చట్టం తీసుకొస్తున్నట్లు హోంమంత్రి అనిత తెలిపారు. దీనిపై సీఎం CBN కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. నిబంధనల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘం కృషి చేస్తోందని చెప్పారు. కొందరు విదేశాల్లో ఉంటూ ఇష్టానుసారం పోస్టులు పెడుతున్నారని, ఎక్కడ దాక్కున్నా వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టం రాబోతోందని చెప్పారు. SMలో మహిళలపై వ్యక్తిత్వ హననం ఎక్కువవుతోందని వాపోయారు.