News September 30, 2024

Stock Market: దలాల్ స్ట్రీట్‌పై బేర్స్ పంజా

image

బేర్స్ పంజాతో దేశీయ‌ బెంచ్ మార్క్ సూచీలు విల‌విల్లాడాయి. సోమ‌వారం ట్రేడింగ్‌లో ఏ ద‌శ‌లోనూ కోలుకోలేక‌పోయాయి. సెన్సెక్స్ 1,272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్ల భారీ న‌ష్టాన్ని మూట‌గ‌ట్టుకున్నాయి. రెండు సూచీల్లోనూ Lower Lows మిన‌హా ఏ ర‌క‌మైన ప్యాట్ర‌న్ ద‌ర్శన‌మివ్వ‌లేదు. సెన్సెక్స్ 84,299 వద్ద, నిఫ్టీ 25,810 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్లు ఆల్ టైం హైలో ఉండ‌డంతో ఓవ‌ర్ వాల్యూయేష‌న్ భ‌యాలు వెంటాడాయి.

Similar News

News October 13, 2024

సీఐడీ చేతికి మరో 2 కేసులు అప్పగింత

image

AP: మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసు, చంద్రబాబు నివాసంపై దాడి కేసును సీఐడీకి బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ కేసులు మంగళగిరి, తాడేపల్లి పీఎస్‌ల పరిధిలో ఉన్నాయి. విచారణ వేగవంతం కోసం ఈ నిర్ణయం తీసుకోగా, ఆయా ఫైళ్లను సీఐడీకి మంగళగిరి డీఎస్పీ రేపు అప్పగించనున్నారు.

News October 13, 2024

క్రిశాంక్‌కు మెయిన్‌హార్ట్ సంస్థ నోటీసులు

image

TG: BRS నేత మన్నె క్రిశాంక్‌కు సింగపూర్‌కు చెందిన మెయిన్‌హార్ట్ సంస్థ లీగల్ నోటీసులు పంపింది. మూసీ ప్రాజెక్టు కన్సల్టెన్సీ విషయంలో తమ కంపెనీ ప్రతిష్ఠ దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంపై బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసింది. లేదంటే సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అటు తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గనని, నోటీసులపై KTR, బీఆర్ఎస్ లీగల్ సెల్‌తో చర్చిస్తున్నట్లు క్రిశాంక్ బదులిచ్చారు.

News October 13, 2024

రాష్ట్రంలో మూడు రోజులు భారీ వర్షాలు

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కారణంగా అల్పపీడనం ఏర్పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. దీంతో ఈ నెల 14 నుంచి 16 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో వర్షాలు కురుస్తాయని చెప్పింది. ఏలూరు, పశ్చిమగోదావరి, పల్నాడు, ప్రకాశం, సత్యసాయి జిల్లాల్లో వానలు పడతాయని అంచనా వేసింది.