News September 30, 2024
Stock Market: దలాల్ స్ట్రీట్‌పై బేర్స్ పంజా
బేర్స్ పంజాతో దేశీయ బెంచ్ మార్క్ సూచీలు విలవిల్లాడాయి. సోమవారం ట్రేడింగ్‌లో ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. సెన్సెక్స్ 1,272 పాయింట్లు, నిఫ్టీ 368 పాయింట్ల భారీ నష్టాన్ని మూటగట్టుకున్నాయి. రెండు సూచీల్లోనూ Lower Lows మినహా ఏ రకమైన ప్యాట్రన్ దర్శనమివ్వలేదు. సెన్సెక్స్ 84,299 వద్ద, నిఫ్టీ 25,810 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్లు ఆల్ టైం హైలో ఉండడంతో ఓవర్ వాల్యూయేషన్ భయాలు వెంటాడాయి.
Similar News
News October 9, 2024
ఈ జిల్లాల్లో వర్షాలు
TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆదిలాబాద్, కొమురంభీమ్, మంచిర్యాల, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి నారాయణపేట, గద్వాల, కొత్తగూడెం, ఖమ్మం, జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది.
News October 9, 2024
వారు రుణమాఫీకి దరఖాస్తు చేసుకోవచ్చు: కోదండరెడ్డి
TG: అర్హులైన రైతులు రుణమాఫీ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వ్యవసాయ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి తెలిపారు. సాంకేతిక కారణాలతో కొంతమందికి రుణమాఫీ కాలేదని వ్యవసాయ శాఖ గుర్తించిందన్నారు. ఇప్పటికే ఆరు లక్షల దరఖాస్తులు పరిష్కరించామన్నారు. రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ, బీఆర్ఎస్ రుణమాఫీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని దుయ్యబట్టారు. అర్హులందరికీ రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు.
News October 9, 2024
నాగార్జునVSసురేఖ: ఈనెల 10న మరో వ్యక్తి వాంగ్మూలం రికార్డు
తమ కుటుంబంపై మంత్రి సురేఖ ఆరోపణలను ఖండిస్తూ హీరో నాగార్జున దాఖలు చేసిన పరువునష్టం దావా కేసు విచారణ ఈనెల 10కి వాయిదా పడింది. ఆరోజు మరో సాక్షి వాంగ్మూలం రికార్డు చేస్తామని నాగ్ తరఫు లాయర్ అశోక్‌రెడ్డి తెలిపారు. అదే రోజు మంత్రికి నోటీసులు జారీ చేసే అవకాశముందన్నారు. అటు నాగార్జున పిటిషన్ నిలబడదని సురేఖ న్యాయవాది తిరుపతివర్మ అన్నారు. ఆయన పిటిషన్‌లో ఒకలా, కోర్టు వాంగ్మూలంలో మరోలా చెప్పారన్నారు.