News September 30, 2024

నాలుగో రోజు ముగిసిన ఆట

image

భారత్-బంగ్లా రెండో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 26 రన్స్ చేసింది. అశ్విన్‌కే 2 వికెట్లు పడ్డాయి. బంగ్లా మరో 26 రన్స్ వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285/9 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా 233 రన్స్‌కు ఆలౌటైంది.

Similar News

News September 30, 2024

ఐపీఎల్ వేలం విదేశాల్లో ఉండొచ్చు: శుక్లా

image

వచ్చే ఐపీఎల్ వేలాన్ని విదేశాల్లో నిర్వహించే అవకాశాలున్నాయని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. అయితే దానిపై ఇంకా తుది నిర్ణయానికి రాలేదని పేర్కొన్నారు. ‘మన టోర్నీ ప్రాచుర్యాన్ని విదేశాలకూ విస్తరింపచేయాలనేదే మా లక్ష్యం. దానికి తగ్గట్టుగా విదేశాల్లో కూడా వేలం నిర్వహిస్తాం. బయటి దేశాల్లో మ్యాచులెలాగూ ఆడట్లేదు కాబట్టి కనీసం వేలం వంటి ఈవెంట్స్‌తో జనం దృష్టిని ఆకర్షించాలి’ అని వివరించారు.

News September 30, 2024

CM చంద్రబాబును కలిసిన సీపీఐ నేతలు

image

AP: వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు కలిశారు. ప్రజా సమస్యలు, బుడమేరు, కొల్లేరు ఆక్రమణల తొలగింపు, పోలవరం నిర్వాసితులకు న్యాయం చేయడం, గాంధీ జయంతి రోజు సత్ప్రవర్తన కలిగిన ఖైదీలను విడుదల చేయడం వంటి అంశాలపై సీఎంకు వినతిపత్రం అందించారు.

News September 30, 2024

ఇంగ్లండ్ రికార్డును బద్దలుగొట్టిన భారత్

image

టెస్టుల్లో ఒక కాలెండర్ సంవత్సరంలో అత్యధిక సిక్సులు కొట్టిన జట్టుగా భారత్ అవతరించింది. ఈ ఏడాది 14 ఇన్నింగ్స్‌లలోనే 90 సిక్సులు కొట్టి చరిత్ర లిఖించింది. బంగ్లాతో 2వ టెస్టులో ఈ ఫీట్ సాధించి, 2022లో ఇంగ్లండ్ (29 ఇన్నింగ్స్‌లలో 89 సిక్సులు) నెలకొల్పిన రికార్డును తిరగరాసింది. ఈ ఏడాది మరిన్ని టెస్టు మ్యాచులున్న నేపథ్యంలో భారత్ సరికొత్త రికార్డుల్ని క్రియేట్ చేసే అవకాశం ఉంది.