News September 30, 2024

నాలుగో రోజు ముగిసిన ఆట

image

భారత్-బంగ్లా రెండో టెస్ట్ నాలుగో రోజు ఆట ముగిసింది. ఆట ముగిసే సమయానికి బంగ్లా రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 26 రన్స్ చేసింది. అశ్విన్‌కే 2 వికెట్లు పడ్డాయి. బంగ్లా మరో 26 రన్స్ వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 285/9 వద్ద డిక్లేర్ చేసింది. బంగ్లా 233 రన్స్‌కు ఆలౌటైంది.

Similar News

News October 16, 2024

నేడు భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టు

image

మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌లో భాగంగా ఇవాళ భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఇరు జట్ల మధ్య ఉదయం 9.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా 36 ఏళ్లుగా న్యూజిలాండ్ మన గడ్డపై సిరీస్ గెలవలేదు. ఇప్పుడైనా గెలిచి ఆ రికార్డును తుడిచేయాలని కివీస్ భావిస్తోంది. మరోవైపు టీమ్ ఇండియాకు సొంత గడ్డపై ఎదురేలేకుండా పోతోంది. 2013 నుంచి ఇక్కడ ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు.

News October 16, 2024

నేడు క్యాబినెట్ భేటీ.. కొత్త పాలసీలపై చర్చ

image

AP: CM చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ అమరావతిలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో ఐదారు రంగాలకు చెందిన కొత్త పాలసీలపై చర్చించి, ఆమోదించే ఛాన్స్ ఉంది. ఎలక్ట్రానిక్స్, క్లీన్ ఎనర్జీ, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్, MSMEలు, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రైవేట్ పారిశ్రామిక పార్కులకు సంబంధించిన విధానాలపై చర్చించనున్నారు. ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన కంపెనీలకు10% ప్రోత్సాహకం ఇచ్చేలా పారిశ్రామిక విధానం రూపొందిస్తున్నారు.

News October 16, 2024

SBI క్రెడిట్‌కార్డు యూజర్లకు గుడ్ న్యూస్

image

దేశవ్యాప్తంగా ఉన్న 19.5 మిలియన్ల SBI క్రెడిట్ కార్డు యూజర్లకు సంస్థ శుభవార్త చెప్పింది. పండుగల సీజన్ సందర్భంగా ‘ఖుషియోన్ కా ఉత్సవ్’ పేరుతో కొనుగోళ్లపై ప్రత్యేక <>ఆఫర్లను<<>> ప్రకటించింది. ప్రముఖ ఎలక్ట్రానిక్ బ్రాండ్లు, మొబైల్ ఫోన్స్, ఫ్యాషన్&లైఫ్‌స్టైల్, ఆభరణాలు, ల్యాప్‌టాప్స్, టీవీలు, దుస్తులు, ఫుడ్, డొమెస్టిక్ ఫ్లైట్స్ టికెట్ ధరలు తదితర వాటిపై భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్, EMI ఆఫర్లు ఉన్నాయి.