News September 30, 2024

సీఎం సిద్దరామయ్యపై ఈడీ కేసు

image

ముడా కేసులో మ‌నీలాండ‌రింగ్ ఆరోప‌ణ‌ల‌పై క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రి సిద్దరామ‌య్య‌ సహా పలువురిపై ఈడీ కేసు న‌మోదు చేసింది. ఈ వ్య‌వ‌హారంలో విచార‌ణ‌కు గ‌వ‌ర్న‌ర్ ఇచ్చిన ఆదేశాల‌ను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్ర‌యించినా సిద్దరామ‌య్య‌కు ఊర‌ట ద‌క్కలేదు. దీంతో లోకాయుక్తలో ఆయనపై FIR నమోదైన విషయం తెలిసిందే. మైసూరు అర్బ‌న్ డెవ‌లప్మెంట్ అథారిటీలో సీఎం సతీమణికి భూకేటాయింపులపై వివాదం చెలరేగింది.

Similar News

News October 1, 2024

టీమ్ ఇండియా రికార్డుల విధ్వంసం

image

బంగ్లాతో రెండో టెస్టులో టీమ్ ఇండియా రికార్డుల విధ్వంసం సృష్టించింది. అవి.. టెస్టుల్లో జట్టు స్కోర్లలో అత్యంత వేగంగా 50, 100, 150, 200, 250 రన్స్. తొలి 3 ఓవర్లలోనే స్కోరు 50 దాటించిన ఏకైక జట్టు. కనీసం 200 బంతులు ఆడిన ఇన్నింగ్స్‌లలో అత్యధిక రన్‌రేట్(8.22). పురుషుల క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన 50+ భాగస్వామ్యం(రోహిత్-జైస్వాల్: 23 బంతుల్లో 55). టెస్టుల్లో ఒక ఏడాదిలో అత్యధిక సిక్సులు(96).

News October 1, 2024

ఎన్టీఆర్-ప్రశాంత్ ప్రాజెక్టుపై ఇంట్రెస్టింగ్ న్యూస్!

image

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించనున్న యాక్షన్ ఫిల్మ్ త్వరలో ప్రారంభం కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ చిత్రం బంగ్లాదేశ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగుతుందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. హీరోయిన్‌గా రష్మిక నటించనున్నారని, ఎన్టీఆర్ క్యారెక్టరైజేషన్ హైలైట్‌గా నిలిచేలా కథ ఉంటుందని తెలుస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

News October 1, 2024

KGBVల్లో ఉద్యోగాలు.. దరఖాస్తు చేశారా?

image

AP: KGBVల్లో 604 కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ కొనసాగుతోంది. అర్హులైన అభ్యర్థులు అక్టోబర్ 10వ తేదీ వరకూ దరఖాస్తు చేయవచ్చు. ఇందులో టీచర్ జాబ్‌లు 507 కాగా, నాన్-టీచింగ్ ఉద్యోగాలు 97 ఉన్నాయి. OCT 14 నుంచి 16లోగా మెరిట్ లిస్ట్ విడుదల చేసి, 17, 18 తేదీల్లో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేస్తారు. 19న ఫైనల్ మెరిట్ లిస్టు ప్రకటించి, 23న అపాయింట్‌మెంట్ లెటర్లు అందిస్తారు. వివరాలకు <>క్లిక్<<>> చేయండి.