News September 30, 2024
సీఎం సిద్దరామయ్యపై ఈడీ కేసు
ముడా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య సహా పలువురిపై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ వ్యవహారంలో విచారణకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను కొట్టేయాలంటూ హైకోర్టును ఆశ్రయించినా సిద్దరామయ్యకు ఊరట దక్కలేదు. దీంతో లోకాయుక్తలో ఆయనపై FIR నమోదైన విషయం తెలిసిందే. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలో సీఎం సతీమణికి భూకేటాయింపులపై వివాదం చెలరేగింది.
Similar News
News October 9, 2024
జో రూట్ ది గోట్ అనాల్సిందే!
నేటి తరం క్రికెట్‌లో విరాట్, రూట్, విలియమ్సన్, స్మిత్ అద్భుతమైన ఆటగాళ్లని క్రీడా నిపుణులు చెబుతుంటారు. అయితే రూట్ మిగిలినవారిని దాటి చాలా ముందుకెళ్లిపోయారు. గడచిన నాలుగేళ్ల రికార్డు చూస్తే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్(గోట్) అనాల్సిందే. 45 నెలల్లో 50 టెస్టు మ్యాచులాడిన రూట్, దాదాపు 60 సగటుతో 5వేలకు పైగా రన్స్ చేశారు. వీటిలో 18 శతకాలున్నాయి. ఇంగ్లండ్ తరఫున అత్యధిక టెస్ట్ రన్స్ జాబితాలో ఆయనదే అగ్రస్థానం.
News October 9, 2024
పాకిస్థాన్‌కు ఐసీసీ బిగ్ షాక్?
పాకిస్థాన్ టీమ్‌కు ICC బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఛాంపియన్స్ ట్రోఫీని పాక్‌లో కాకుండా ఇతర దేశాల్లో నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. UAE, శ్రీలంక, సౌతాఫ్రికాల్లో ఎక్కడో ఓ చోట టోర్నీ నిర్వహించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. లేదంటే హైబ్రిడ్ మోడల్‌లో భారత్ మ్యాచులు పాక్ ఆవల నిర్వహించాలని భావిస్తున్నట్లు టాక్. BCCI అంగీకరిస్తే పాక్‌లోనే టోర్నీ ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం.
News October 9, 2024
ఏపీ ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం
AP: లిక్కర్ షాపుల టెండర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,000 కోట్ల ఆదాయం వచ్చిందని ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిశాంత్ కుమార్ వెల్లడించారు. ఇప్పటివరకు 50వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. ఈ నెల 11 వరకు అప్లికేషన్లు సమర్పించేందుకు అవకాశం ఉందన్నారు. వాటిని వెరిఫై చేసి 14న డ్రా తీసి సెలక్ట్ చేస్తామని చెప్పారు. 16 నుంచి కొత్త లైసెన్స్ పీరియడ్ ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.