News October 1, 2024
శక్తిమాన్ చేయడానికి రణ్‌వీర్ పనికిరాడు: ముకేశ్ ఖన్నా

ముకేశ్ ఖన్నా పోషించిన శక్తిమాన్ పాత్ర ఓ తరాన్ని కట్టిపడేసింది. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్ హీరోగా అదే శక్తిమాన్‌ను సినిమాగా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఖన్నా పెదవివిరిచారు. ‘రణ్‌వీర్ అద్భుతమైన నటుడు. తన ఎనర్జీ వేరే స్థాయిలో ఉంటుంది. కాదనను. కానీ తను శక్తిమాన్‌గా పనికిరాడు. ఓ మ్యాగజైన్‌కు నగ్నంగా ఫోజులిచ్చినప్పటి నుంచి అతడిపై నా అయిష్టం మొదలైంది’ అని పేర్కొన్నారు.
Similar News
News January 21, 2026
లైఫ్ ఇన్సూరెన్స్: ప్రీమియం చెల్లింపులో జాప్యం చేస్తే..?

టర్మ్ ఇన్సూరెన్స్ నెలవారీ ప్రీమియానికి 15రోజులు, మూడు, ఆరు నెలల ప్రీమియం చెల్లించేందుకు 30రోజుల సమయం ఇస్తారు. అప్పటికీ ప్రీమియం కట్టకపోతే ఇన్సూరెన్స్ ల్యాప్స్ అవుతుందని గో డిజిట్ లైఫ్ ఇన్సూరెన్స్ MD సబ్యసాచి తెలిపారు. ‘దీంతో క్లయింట్లు కవరేజీ కోల్పోతారు. కొన్ని కంపెనీలు మాత్రమే ఇన్సూరెన్స్‌ను పునరుద్ధరిస్తాయి. అందుకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తంతో పాటు వడ్డీని వసూలు చేస్తాయి’ అని వివరించారు.
News January 21, 2026
‘మూసీ పునరుజ్జీవనం’లో ‘టాటా’ భాగస్వామ్యం

TG: దావోస్‌లో టాటా ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. విజన్–2047 లక్ష్యాలు, రాష్ట్రంలోని పెట్టుబడుల అనుకూల విధానాలను వివరించారు. HYDలోని స్టేడియాల అభివృద్ధికి సహకరించాలని కోరగా టాటా ఛైర్మన్ సంసిద్దత తెలిపారు. మూసీ నది పునరుజ్జీవనంలో భాగస్వామ్యమయ్యేందుకు ఆసక్తి వ్యక్తపరిచారు. హోటళ్లు, రిసార్ట్స్, మాన్యుఫాక్చరింగ్ యూనిట్ల ఏర్పాటు చేసేందుకు CM చంద్రశేఖరన్ చర్చించారు.
News January 21, 2026
గుండెపోటుతో నటుడు మృతి

మలయాళ నటి ఊర్వశి సోదరుడు, నటుడు కమల్ రాయ్(54) కన్నుమూశారు. చెన్నైలో ఆయన గుండెపోటుతో మరణించారు. తమిళ్ సినిమా ‘పుతుస పడికిరెన్ పాటు’ సినిమాతో హీరోగా పరిచయమైన కమల్ 30 చిత్రాల్లో నటించారు. ఇందులో సాయుజ్యం, మంజు, కింగిని, వచలమ్, శోభనం, ది కింగ్ మేకర్, లీడర్ తదితర సినిమాలున్నాయి. ఆయన సోదరి ఊర్వశి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలు. ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మొత్తం 350 చిత్రాల్లో నటించారు.


