News October 1, 2024

శక్తిమాన్ చేయడానికి రణ్‌వీర్ పనికిరాడు: ముకేశ్ ఖన్నా

image

ముకేశ్ ఖన్నా పోషించిన శక్తిమాన్ పాత్ర ఓ తరాన్ని కట్టిపడేసింది. ఇప్పుడు రణ్‌వీర్ సింగ్‌ హీరోగా అదే శక్తిమాన్‌ను సినిమాగా తీసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఖన్నా పెదవివిరిచారు. ‘రణ్‌వీర్ అద్భుతమైన నటుడు. తన ఎనర్జీ వేరే స్థాయిలో ఉంటుంది. కాదనను. కానీ తను శక్తిమాన్‌గా పనికిరాడు. ఓ మ్యాగజైన్‌కు నగ్నంగా ఫోజులిచ్చినప్పటి నుంచి అతడిపై నా అయిష్టం మొదలైంది’ అని పేర్కొన్నారు.

Similar News

News October 11, 2024

సీఎం, డిప్యూటీ సీఎం మధ్య మాటల యుద్ధం!

image

బారామ‌తికి సంబంధించి శ‌ర‌ద్ ప‌వార్ పంపిన ప్ర‌తిపాద‌న‌ల‌ను CM ఏక్‌నాథ్ శిండే క్యాబినెట్ ముందుంచడంపై Dy.CM అజిత్ కినుక వహించినట్లు తెలుస్తోంది. దీనిపై గురువారం జ‌రిగిన క్యాబినెట్ భేటీలో వీరిద్దరి మధ్య వాడీవేడి చ‌ర్చ జ‌రిగిన‌ట్టు స్థానిక మీడియా తెలిపింది. శిండే ప్రవేశపెట్టిన అంశాల ఆమోదానికి అజిత్ నిరాక‌రించారని, అనంతరం మీటింగ్ నుంచి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, అజిత్ దీన్ని ఖండించారు.

News October 11, 2024

రేపు ఏపీవ్యాప్తంగా వర్షాలు

image

ఏపీవ్యాప్తంగా రేపు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, నంద్యాల, ATP, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, పార్వతీపురం మన్యం, అల్లూరి, అనకాపల్లి, GNT, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, YSR, అన్నమయ్య, చిత్తూరు, TPT జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

News October 11, 2024

ఆ మ్యాచ్‌కి భారత జట్టు కెప్టెన్ ఎవరు?

image

ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌లో మొద‌టి రెండు మ్యాచ్‌ల‌లో ఒక‌దానికి కెప్టెన్ <<14326057>>రోహిత్ శ‌ర్మ గైర్హాజ‌ర‌య్యే<<>> అవ‌కాశం ఉండ‌డంతో ఆ మ్యాచ్‌కి సారథ్యం వ‌హించేది ఎవ‌ర‌న్న దానిపై ఆస‌క్తి నెల‌కొంది. బుమ్రా, కేఎల్ రాహుల్, శుభ్‌మ‌న్ గిల్‌, రిష‌భ్ పంత్‌ల‌లో ఒకరికి కెప్టెన్‌గా ఛాన్స్ ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. AUS లాంటి బలమైన జట్టుతో మ్యాచ్ కాబట్టి మళ్లీ కోహ్లీకి పగ్గాలు ఇచ్చే అవకాశం లేకపోలేదు.