News October 1, 2024

డిస్కౌంట్స్‌కు ముందు ధరల పెంపు.. రంగంలోకి AUS ప్రధాని

image

భారీ డిస్కౌంట్ల పేరుతో చేస్తోన్న స్కామ్‌ను నివారించేందుకు ఏకంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రంగంలోకి దిగారు. అక్కడి సూపర్ మార్కెట్స్ డిస్కౌంట్స్ ఇచ్చేముందు ప్రొడక్ట్ లేబుల్స్‌ను మార్చేస్తున్నాయని వాచ్‌డాగ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆంథోనీ తన తోటి పార్లమెంట్ సభ్యురాలు మేరీ డోయల్‌తో పాటు మరికొందరితో చర్చించినట్లు ట్వీట్ చేశారు. సాధ్యమైనంత తక్కువ ధరకు వస్తువులు అందేలా కృషి చేస్తామన్నారు.

Similar News

News October 1, 2024

సరిహద్దుల్లో ఇంకా సాధారణ పరిస్థితి రాలేదు: ఆర్మీ చీఫ్

image

చైనాతో సరిహద్దుల్లో పరిస్థితి సాధారణ స్థితికి ఇంకా రాలేదని భారత ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ కార్యక్రమంలో తెలిపారు. ‘దౌత్యపరంగా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో మాత్రం కోర్ కమాండర్లదే తుదినిర్ణయం. 2020కి పూర్వం ఉన్న స్థితి నెలకొనాలి. అప్పటి వరకు బోర్డర్‌లో వాతావరణం గుబులుగానే ఉంటుంది. యుద్ధం వచ్చినప్పుడు వస్తుంది కానీ మేం మాత్రం ఎప్పుడూ రెడీగానే ఉంటాం’ అని పేర్కొన్నారు.

News October 1, 2024

భయపడేవారు ఎవరూ లేరిక్కడ: KTR

image

TG: సీఎం రేవంత్ రెడ్డిపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రజలకు తాము అండగా నిలబడటాన్ని ఎవరూ ఆపలేరని స్పష్టం చేశారు. ‘మీ తాటాకు చప్పుళ్లకు భయపడేవాడిని కాదు. ఇది ఉద్యమాల పిడికిలి అని గుర్తు పెట్టుకోవాలి. పేదల గొంతులను మీ బుల్డోజర్లు తొక్కి పెట్టలేవు’ అని HYDRAA ఇళ్లను కూల్చేస్తున్న ఫొటోను KTR షేర్ చేశారు.

News October 1, 2024

డేరా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్‌కు 15వ సారి పెరోల్

image

అత్యాచారం కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభ‌విస్తున్న డేరా చీఫ్ గుర్మీత్ రామ్ ర‌హీమ్ పెరోల్‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం అనుమ‌తించింది. అక్టోబ‌ర్ 5న జ‌ర‌గ‌నున్న‌ హ‌రియాణా ఎన్నిక‌ల ముందు ఆయ‌న‌కు పెరోల్ రావ‌డం రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసింది. ఇప్ప‌టికే ఈ కేసులో ఆయ‌న గత 9 నెల‌ల్లో మూడుసార్లు, గ‌త నాలుగేళ్ల‌లో 15 సార్లు పెరోల్‌పై విడుద‌లవ్వ‌డం గ‌మ‌నార్హం. అత‌ని పెరోల్ ర‌ద్దు చేయాల‌ని ఈసీని కాంగ్రెస్ కోరింది.