News October 1, 2024
డిస్కౌంట్స్‌కు ముందు ధరల పెంపు.. రంగంలోకి AUS ప్రధాని
భారీ డిస్కౌంట్ల పేరుతో చేస్తోన్న స్కామ్‌ను నివారించేందుకు ఏకంగా ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ రంగంలోకి దిగారు. అక్కడి సూపర్ మార్కెట్స్ డిస్కౌంట్స్ ఇచ్చేముందు ప్రొడక్ట్ లేబుల్స్‌ను మార్చేస్తున్నాయని వాచ్‌డాగ్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆంథోనీ తన తోటి పార్లమెంట్ సభ్యురాలు మేరీ డోయల్‌తో పాటు మరికొందరితో చర్చించినట్లు ట్వీట్ చేశారు. సాధ్యమైనంత తక్కువ ధరకు వస్తువులు అందేలా కృషి చేస్తామన్నారు.
Similar News
News October 15, 2024
భారత దౌత్యవేత్తలను బహిష్కరించిన కెనడా
కెనడాలోని భారత హైకమిషనర్ సహా ఆరుగురు దౌత్యవేత్తలను కెనడా ప్రభుత్వం బహిష్కరించింది. వారు కచ్చితంగా తమ దేశాన్ని వీడాల్సిందేనని, దౌత్యవేత్తలుగా ఉండడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ ఆరుగురు తమ దేశంలో క్రిమినల్ చర్యలకు పాల్పడ్డారని, పబ్లిక్ సేఫ్టీకి విఘాతం కలిగించారని సంచలన ఆరోపణలు చేసింది. కాగా, కెనడా ఈ ప్రకటన చేయకముందే భారత్ ఆ ఆరుగురు <<14357189>>దౌత్యవేత్తలను<<>> వెనక్కి పిలిచింది.
News October 15, 2024
ఇస్రో చీఫ్‌కు వరల్డ్ స్పేస్ అవార్డు
ఇస్రో చీఫ్ సోమనాథ్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు-2024ను అందుకున్నారు. మిలాన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఆయనకు ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఈ అవార్డును ప్రదానం చేసింది. గత ఏడాది ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 విజయవంతమైన నేపథ్యంలో దానికి గుర్తుగా ఆయనను ఈ అవార్డుతో సత్కరించింది. ఈ మిషన్ అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించిందని, చరిత్రాత్మక మైలురాయిగా నిలిచిందని పేర్కొంది.
News October 15, 2024
భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
AP: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో నేడు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ముందుజాగ్రత్తగా ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు ఇవాళ కలెక్టర్లు సెలవు ప్రకటించారు.