News October 1, 2024

RECORD: 80 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలకు..

image

సౌత్ కొరియాకు చెందిన మోడల్ చోయ్ సూన్ హ్వా(80) చరిత్ర సృష్టించారు. మిస్ యూనివర్స్ పోటీల్లో కొరియా తరఫున పాల్గొననున్న ఓల్డెస్ట్ మహిళగా నిలిచారు. నవంబర్‌లో మెక్సికో వేదికగా జరిగే ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన 31 మందితో ఆమె పోటీ పడనున్నారు. ‘80 ఏళ్ల మహిళ శరీరాన్ని ఎలా కాపాడుకుంది? ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంది? తినే ఆహారమేంటి? అనే అంశాలపై నేను ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకుంటున్నా’ అని ఆమె చెప్పారు.

Similar News

News December 30, 2025

మాజీ ఎమ్మెల్యే మృతి

image

AP: రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే గుంటి వెంకటేశ్వర ప్రసాద్ గుండెపోటుతో ఇవాళ మృతి చెందారు. అనారోగ్యంతో ఇటీవల తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు వెల్లడించారు. 1999లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిన ప్రసాద్.. 2004లో అదే పార్టీ నుంచి గెలుపొందారు. ఆయన మృతి పట్ల పలువురు రాజకీయ నేతలు సంతాపం తెలిపారు.

News December 30, 2025

Money Tip: ఆపదలో ఆదుకునే ‘ఎమర్జెన్సీ ఫండ్’

image

ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. సడన్‌గా ఉద్యోగం పోయినా, హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేదా ఇంట్లో ఏదైనా రిపేర్ వచ్చినా చేతిలో డబ్బు లేకపోతే చాలా కష్టం. అందుకే ‘ఎమర్జెన్సీ ఫండ్’ ఉండాలి. మీ నెలవారీ ఖర్చులు ఎంతవుతాయో లెక్కేయండి. దానికి కనీసం 6 రెట్లు అమౌంట్ ఎప్పుడూ రెడీగా ఉండాలి. ఉదాహరణకు మీ ఖర్చు ₹25 వేలు అయితే ₹లక్షన్నర విడిగా ఉండాలి. ఈ డబ్బును వెంటనే చేతికి అందేలా ఇన్వెస్ట్ చేయడం బెస్ట్.

News December 30, 2025

గ్రూప్‌-2 రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ల కొట్టివేత

image

AP: గ్రూప్‌-2 రిజర్వేషన్లపై దాఖలైన అన్ని పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. రిజర్వేషన్ల పాయింట్లను సవాల్ చేస్తూ 2023లో ఇచ్చిన గ్రూప్-2 నోటిఫికేషన్‌ను రద్దు చేయాలంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్‌ పాటించాలని కోరారు. వీటిపై విచారణ చేపట్టిన ధర్మాసనం కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది.