News October 1, 2024
RECORD: 80 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ పోటీలకు..
సౌత్ కొరియాకు చెందిన మోడల్ చోయ్ సూన్ హ్వా(80) చరిత్ర సృష్టించారు. మిస్ యూనివర్స్ పోటీల్లో కొరియా తరఫున పాల్గొననున్న ఓల్డెస్ట్ మహిళగా నిలిచారు. నవంబర్‌లో మెక్సికో వేదికగా జరిగే ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన 31 మందితో ఆమె పోటీ పడనున్నారు. ‘80 ఏళ్ల మహిళ శరీరాన్ని ఎలా కాపాడుకుంది? ఇంత ఆరోగ్యంగా ఎలా ఉంది? తినే ఆహారమేంటి? అనే అంశాలపై నేను ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తాలనుకుంటున్నా’ అని ఆమె చెప్పారు.
Similar News
News October 12, 2024
నేటి నుంచి పాపికొండలు టూర్ స్టార్ట్
దసరా సందర్భంగా పర్యాటకులకు ఏపీ సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. నేటి నుంచి పాపికొండల్లో లాంచీల్లో విహరించేందుకు అధికారులు అనుమతిచ్చారు. వరదల కారణంగా ఐదు నెలల పాటు పాపికొండలు టూరిజంను నిలిపివేశారు. ప్రస్తుత పరిస్థితులు మెరుగవ్వడంతో లాంచీ యజమానుల విజ్ఞప్తుల మేరకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు.
News October 12, 2024
నవంబర్ 8 నుంచి DAO సర్టిఫికెట్ వెరిఫికేషన్
TG: డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్(DAO) ఉద్యోగాలకు ప్రాథమికంగా అర్హత సాధించిన అభ్యర్థులకు TGPSC కీలక అప్‌డేట్ ఇచ్చింది. నవంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు నాంపల్లిలోని తెలుగు యూనివర్సిటీలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరుగుతుందని తెలిపింది. అభ్యర్థులు 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం 1:2 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేశారు. దివ్యాంగుల కేటగిరీలో 1:5 నిష్పత్తిలో సెలక్ట్ చేశారు.
News October 12, 2024
పండగకు ఊరెళ్తున్న సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తన స్వగ్రామం కొండారెడ్డిపల్లికి వెళ్లనున్నారు. సీఎం హోదాలో తొలిసారి సొంతూరికి వెళ్తున్న ఆయన అక్కడే దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈమేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేవంత్ కుటుంబ సమేతంగా పండుగ జరుపుకోనున్నారు.