News October 2, 2024

పండుగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్త

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్త. ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి. ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.

Similar News

News October 2, 2024

ఈ నెల 10న సెలవు ఇవ్వాలని డిమాండ్

image

TG: సద్దుల బతుకమ్మ జరుపుకునే అక్టోబర్ 10న ప్రభుత్వం అధికారిక సెలవు ఇవ్వాలని తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్ అసోసియేషన్ కోరింది. మహిళలు ఎంతో పవిత్రంగా జరుపుకునే ఈ రోజున ఆప్షనల్ సెలవు కాకుండా రెగ్యులర్ సెలవు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. సీఎంవో ముఖ్య కార్యదర్శి శేషాద్రిని కలిసి ఈ మేరకు వినతిపత్రం ఇచ్చింది. దీనిపై స్పందిస్తే ప్రభుత్వ కార్యాలయాలకు ఈ నెల 10న సెలవు ఉండనుంది.

News October 2, 2024

MUDA SCAM: బాపూజీ ధైర్యమిస్తున్నాడన్న సిద్దరామయ్య

image

ముడా స్కామ్, ED నోటీసులు, లోకాయుక్త కేసులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో బాపూ జీవితం, ఆయన ఆలోచనలే తనకు ధైర్యం ఇస్తున్నాయని కర్ణాటక CM సిద్దరామయ్య అన్నారు. ప్రజలకు గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘మతతత్వం, నియంతృత్వం, హింసతో నిండిన ఈ ప్రపంచంలో మహాత్మా గాంధీ, సత్య స్వరూపం, శాంతి, అహింసే మన చేతిపట్టి నడిపిస్తాయి’ అని ట్వీట్ చేశారు. ఆయనపై లోకాయుక్త FIR, ఈడీ ECIR రిజిస్టర్ చేయడం తెలిసిందే.

News October 2, 2024

సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేశాం: సురేఖ

image

TG: తనపై ట్రోలింగ్ చేసిన సోషల్ మీడియా అకౌంట్లపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు. ఇక్కడి 3, దుబాయ్ నుంచి మరో 3 ఖాతాల ద్వారా ట్రోల్ చేశారన్నారు. ‘ఐదేళ్లు BRSలో పనిచేశా. నా వ్యక్తిత్వం అందరికీ తెలుసు. రాజకీయాల్లో విలువలు దిగజారిపోయాయి. మా ప్రభుత్వ తప్పులను ఎత్తిచూపాలి. ఈ ఘటనపై KTR ఎందుకు స్పందించలేదు? ఆయనకు మనుషుల అనుబంధాల విలువ తెలుసా?’ అని ప్రశ్నించారు.