News October 2, 2024

పండుగకు ఊరెళ్తున్నారా? జాగ్రత్త

image

దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్త. ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి. ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చని పోలీసులు చెబుతున్నారు.

Similar News

News October 9, 2024

GOOD NEWS: ఫోర్టిఫైడ్ రైస్ సప్లై గడువు పెంపు

image

విటమిన్లు కలిపిన ఉచిత ఫోర్టిఫైడ్ రైస్‌ను 2028 వరకు ఇవ్వాలని మోదీ నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. PMGKAY, ఇతర వెల్ఫేర్ స్కీంల కింద వీటిని సరఫరా చేసేందుకు ఆమోదించింది. ఇందుకయ్యే పూర్తి ఖర్చు రూ.17,082 కోట్లకు కేంద్రమే భరించనుంది. 2019-21 మధ్య చేసిన హెల్త్ సర్వేలో దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లలో రక్తహీనత, విటమిన్ల లోపం ఎక్కువగా ఉందని తేలింది. ఈ బియ్యాన్ని ఫ్రీగా ఇస్తున్న సంగతి తెలిసిందే.

News October 9, 2024

అన్ని ఎన్నికలు ఒకేసారి నిర్వహించాలి: CM

image

AP: పార్లమెంట్, అసెంబ్లీ, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. అన్ని ఎన్నికలు ఒకేసారి జరిగితే ప్రభుత్వాలు అభివృద్ధిపై దృష్టి సారించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతిసారి ఎన్నికలు రావడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని పేర్కొన్నారు. భారత్‌ను ప్రపంచంలో అగ్రదేశంగా నిలిపేందుకు మోదీ కృషి చేస్తున్నారని చంద్రబాబు కొనియాడారు.

News October 9, 2024

జో రూట్ సరికొత్త మైలురాయి

image

ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జో రూట్ సరికొత్త మైలురాయి అందుకున్నారు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆరో బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రూట్ సెంచరీ బాదారు. ఇప్పటివరకు ఆయన 35 శతకాలు సాధించారు. ఈ క్రమంలో లారా, గవాస్కర్, యూనిస్ ఖాన్, జయవర్ధనే (34)లను ఆయన అధిగమించారు. ఓవరాల్‌గా సచిన్ (51), కల్లిస్ (45), పాంటింగ్ (41), సంగక్కర (38), రాహుల్ ద్రావిడ్ (35) టాప్‌లో ఉన్నారు.