News October 2, 2024

రాహుల్, ప్రియాంక.. మీ మంత్రుల మాటలు వినండి: BRS

image

KTRపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరమని BRS స్పందించింది. ‘రాజ్యాంగం, ప్ర‌జాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్, ప్రియాంకా గాంధీ.. మీ పార్టీ నేతల మాటలు వినండి. వాళ్లు మహిళలు, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను పబ్లిక్‌లోకి లాగుతున్నారు. రాజ్యాంగం గురించి, దాని విలువల గురించి బోధించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. అనాలోచిత వ్యాఖ్యలతో మీ పార్టీకి సమాధి తవ్వుతున్నారు’ అని ట్వీట్ చేసింది.

Similar News

News October 2, 2024

సురేఖ కామెంట్స్‌పై రేవంత్ ఎలా స్పందిస్తారో?

image

TG: చైతూ-సామ్ విడాకులు, KTR, నాగార్జునపై మంత్రి కొండా సురేఖ <<14254371>>కామెంట్స్<<>> రచ్చకు దారితీశాయి. వీటిపై నాగార్జున ఫ్యామిలీతో పాటు సమంత తీవ్రంగా స్పందించారు. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలని సురేఖకు KTR లీగల్ నోటీసులు పంపారు. అయితే మంత్రి కామెంట్స్‌పై CM రేవంత్ రెడ్డి మాత్రం ఇంకా స్పందించలేదు. ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది ఆసక్తిగా మారింది. సురేఖను మందలించి, ఏమైనా చర్యలు తీసుకుంటారా? లేదా? అన్నది చూడాలి.

News October 2, 2024

2 లక్షల మార్కుకు చేరువగా మహీంద్రా థార్

image

నాలుగేళ్ల క్రితం లాంచ్ అయిన మహీంద్రా థార్ వాహన ప్రియుల్లో మంచి ఆదరణ దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఈ నాలుగేళ్లలో 1.90 లక్షల వాహనాలను విక్రయించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది ముగిసేలోపు 2 లక్షల మార్కును దాటేస్తామని ధీమా వ్యక్తం చేసింది. థార్‌ త్రీ-డోర్ వాహనం కాగా.. ఐదు తలుపులతో కూడిన థార్ రాక్స్‌ను మహీంద్రా ఈ ఏడాది తీసుకొచ్చింది. దానికీ అమ్మకాలు భారీగానే ఉండటం విశేషం.

News October 2, 2024

కొండా సురేఖపై అక్కినేని అమల ఫైర్

image

తన ఫ్యామిలీపై అసత్య ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖపై నటుడు అక్కినేని నాగార్జున భార్య అమల మండిపడ్డారు. ‘మంత్రి వ్యాఖ్యలు విని షాక్‌కు గురయ్యా. రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు. నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే ఈ దేశం ఏమైపోతుంది? సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.