News October 2, 2024
రాహుల్, ప్రియాంక.. మీ మంత్రుల మాటలు వినండి: BRS
KTRపై మంత్రి సురేఖ వ్యాఖ్యలు జుగుప్సాకరమని BRS స్పందించింది. ‘రాజ్యాంగం, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే రాహుల్, ప్రియాంకా గాంధీ.. మీ పార్టీ నేతల మాటలు వినండి. వాళ్లు మహిళలు, ప్రముఖుల వ్యక్తిగత జీవితాలను పబ్లిక్‌లోకి లాగుతున్నారు. రాజ్యాంగం గురించి, దాని విలువల గురించి బోధించే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదు. అనాలోచిత వ్యాఖ్యలతో మీ పార్టీకి సమాధి తవ్వుతున్నారు’ అని ట్వీట్ చేసింది.
Similar News
News October 5, 2024
రేవంత్ CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారు: KTR
TG: రేవంత్‌రెడ్డి CM కుర్చీ కాపాడుకునే పనిలో ఉన్నారని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆరోపించారు. డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి అక్టోబర్ వచ్చినా మాఫీ చేయలేదన్నారు. రేవంత్ బోగస్ మాటలు చెప్పి రైతులను మోసం చేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. సీఎం మనుషులనే కాదు దేవుళ్లను కూడా మోసం చేశారని ధ్వజమెత్తారు.
News October 5, 2024
కొండా సురేఖ వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన KTR
TG: తనపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలపై BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR తొలిసారి స్పందించారు. ‘సురేఖ దిక్కుమాలిన గబ్బు మాటలు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు. ఇప్పటికే పరువు నష్టం దావా వేశా. సీఎం రేవంత్‌పైనా వేస్తా’ అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. సమంత విడాకులతో పాటు టాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్లు వెళ్లిపోవడానికి KTR కారణమని సురేఖ ఆరోపించిన విషయం తెలిసిందే.
News October 5, 2024
రేపు భారత్VSపాక్ మ్యాచ్
భారత్ మెన్స్, ఉమెన్స్ క్రికెట్ జట్లు రేపు(ఆదివారం) రెండు అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడనున్నాయి. మహిళల T20WCలో భాగంగా దుబాయ్ వేదికగా మ.3.30కు ఇండియా-పాక్ జట్లు తలపడనున్నాయి. తొలి మ్యాచ్‌లో కివీస్ చేతిలో ఓడిన భారత్‌కు ఈ మ్యాచ్ ఎంతో కీలకం. దీంతో పోరు హోరాహోరీగా ఉండనుంది. మరోవైపు గ్వాలియర్ స్టేడియంలో సూర్య సేన బంగ్లాదేశ్‌తో తొలి T20 ఆడనుంది. రాత్రి 7.30కు మ్యాచ్ ప్రారంభమవుతుంది.