News October 2, 2024
శ్రీదత్త సభా మండపాన్ని ప్రారంభించిన సీఎం

TG: దుండిగల్‌లోని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో నిర్మించిన శ్రీదత్త సభా మండపాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు. ‘ఏ రాష్ట్రంలోనైతే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు సురక్షితంగా భవిష్యత్తు తరాలకు అందించేవాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తా’ అని సీఎం అన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలంగాణకు వచ్చినందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు.
Similar News
News March 20, 2026
గుడ్ న్యూస్: డెయిరీ, గొర్రెల ఫారాలకు ఛార్జీల రద్దు

AP: రాష్ట్రంలోని డెయిరీ, గొర్రెలు, మేకలు, పందుల పెంపకందారుల నుంచి వసూలు చేస్తున్న బెటర్‌మెంటు, డెవలప్మెంటు ఛార్జీలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇక నుంచి వీటిని మినహాయిస్తున్నట్లు మున్సిపల్ శాఖ ఉత్తర్వులు జారీచేసింది. అలాగే వీటికి సంబంధించి మున్సిపాల్టీల పరిధిలోని బిల్డింగ్ పర్మిషన్, లైసెన్స్ ఫీజులను పంచాయతీలతో సమానం చేయనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు ఈ మినహాయింపులపై GO ఇచ్చారు.
News March 20, 2026
ఏప్రిల్ 1 నుంచి ఆ బ్యాంకుల ఏటీఎమ్ రూల్స్ ఛేంజ్!

ATM మనీ విత్‌డ్రాలపై HDFC, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కోత విధించాయి. ఇప్పటివరకు సెపరేట్‌గా ఉన్న UPI విత్‌డ్రాల్స్‌ను రెగ్యూలర్ కార్డ్ విత్‌డ్రాల్‌తో HDFC కలిపేయనుంది. దీంతో ఫ్రీ లిమిట్ దాటితే ట్రాన్సాక్షన్‌కు ₹23 చొప్పున ఛార్జ్ పడుతుంది. ఇక PNB రూపే NCMC ప్లాటినమ్ డొమెస్టిక్ సహా పలు వేరియంట్లపై డైలీ విత్‌డ్రాల్ లిమిట్ ₹లక్ష నుంచి ₹50వేలుకు తగ్గించింది. ఏప్రిల్ 1 నుంచి ఈ మార్పులు అమలులోకి రానున్నాయి.
News March 20, 2026
కొత్తగా 2 లక్షల మందికి పెన్షన్లు: భట్టి

TG: రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన 2 లక్షల మందికి నూతనంగా పెన్షన్లు మంజూరు చేస్తామని ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. ఈ పథకం కోసం బడ్జెట్‌లో రూ.14,861 కోట్లు ప్రతిపాదించామని తెలిపారు. కాగా చేయూత స్కీమ్ కింద ప్రస్తుతం నెలకు రూ.2వేలు, దివ్యాంగులకు రూ.4వేల పెన్షన్ అందుతోంది.


