News October 2, 2024

శ్రీదత్త సభా మండపాన్ని ప్రారంభించిన సీఎం

image

TG: దుండిగల్‌లోని గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో నిర్మించిన శ్రీదత్త సభా మండపాన్ని సీఎం రేవంత్‌ ప్రారంభించారు. ‘ఏ రాష్ట్రంలోనైతే ప్రశాంతమైన వాతావరణం నెలకొని, సంప్రదాయాలు సురక్షితంగా భవిష్యత్తు తరాలకు అందించేవాళ్లకు గౌరవం దక్కుతుందో ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని విశ్వసిస్తా’ అని సీఎం అన్నారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలంగాణకు వచ్చినందుకు రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు చెప్పారు.

Similar News

News November 13, 2024

RGVకి నోటీసులు ఇచ్చిన పోలీసులు

image

దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ పోలీసులు నోటీసులు ఇచ్చారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు ఎస్ఐ శివరామయ్య టీమ్ ఇవాళ HYDలోని ఆర్జీవీ ఇంటికి చేరుకుని నోటీసులు అందించారు. ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్లలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్‌ వ్యక్తిత్వాలు కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారంటూ మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదైంది.

News November 13, 2024

ప్రభాస్ ‘స్పిరిట్’లోకి పూరీ జగన్నాథ్?

image

ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ గురించి టాలీవుడ్‌లో ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాకు డైలాగ్స్ రాయాలంటూ డైరెక్టర్ పూరీ జగన్నాథ్‌ను సందీప్ అడిగారని సమాచారం. అందుకు పూరీ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ ప్రభాస్‌తో తీసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాల్లో డైలాగ్స్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.

News November 13, 2024

తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి ధర రూ.440 తగ్గి రూ.76,850కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.70,450 పలుకుతోంది. అటు వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,01,000కు చేరింది.