News October 3, 2024
ఎయిర్‌లైన్స్ నిర్లక్ష్యం: బాత్రూమ్‌కు పాకుతూ వెళ్లిన దివ్యాంగుడు

ఎయిర్‌లైన్స్ సంస్థ నిర్లక్ష్యం కారణంగా ఓ దివ్యాంగుడు బాత్రూమ్‌కి పాకుతూ వెళ్లిన ఘటన ఇది. ఫ్రాంక్ గార్డెనర్ BBCలో సెక్యూరిటీ కరెస్పాండెంట్‌గా పనిచేస్తున్నారు. తాజాగా పోలాండ్ నుంచి లండన్ వెళ్లేందుకు LOT సంస్థకు చెందిన విమానం ఎక్కారు. ప్రయాణంలో బాత్రూమ్‌కు వెళ్లేందుకు చక్రాల కుర్చీ అడగ్గా సిబ్బంది నిరాకరించారు. దీంతో ఆయన పాకుతూనే వెళ్లారు. ట్విటర్‌లో ఈ విషయాన్ని తెలిపి ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
Similar News
News September 18, 2025
ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.
News September 18, 2025
కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.
News September 18, 2025
OFFICIAL: ‘కల్కి-2’ నుంచి దీపికా పదుకొణె ఔట్

రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె రాబోయే సీక్వెల్‌లో నటించబోరని మేకర్స్ ప్రకటించారు. ‘కల్కి-2లో దీపిక భాగం కాదని ప్రకటిస్తున్నాం. అన్నివిధాలుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కిలాంటి సినిమాలో నటించే నటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపిక తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.