News October 3, 2024

టీమ్ ఇండియా ఇంగ్లండ్‌ను కాపీ కొట్టింది: మైకేల్ వాన్

image

బంగ్లాతో రెండో టెస్టులో దూకుడు విషయంలో భారత్ ఇంగ్లండ్‌ను కాపీ కొట్టిందని మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ ఓ పాడ్‌కాస్ట్‌లో అన్నారు. ‘భారత్ కచ్చితంగా ఇంగ్లండ్ బాజ్‌బాల్‌ను కాపీ కొట్టింది. ఈ విషయంలో టీమ్ ఇండియా వద్ద ఇంగ్లండ్ ఏమైనా ఛార్జీలు వసూలు చేయొచ్చా?’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల్ని ఆస్ట్రేలియా మాజీ కీపర్ గిల్‌క్రిస్ట్ సరిచేశారు. గంభీర్ కోచింగ్‌లో ‘గామ్‌బాల్’ను భారత్ ఆడుతోందని పేర్కొన్నారు.

Similar News

News October 10, 2024

ఒకే ఇంట్లో నలుగురు MBBSలు

image

TG: ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం. కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమత 2018లో, రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కూతుళ్లు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. వీరిని హరీశ్ రావు అభినందించారు.

News October 10, 2024

800: 147 ఏళ్ల చరిత్రలో నాలుగోసారే

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ 823/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా 27 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌లో 800కుపైగా పరుగులు నమోదయ్యాయి. అలాగే 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇప్పటివరకు శ్రీలంక, ఇంగ్లండ్ మాత్రమే 800కుపైగా స్కోర్లు చేశాయి. లంక ఓసారి, ఇంగ్లండ్ మూడు సార్లు ఈ ఫీట్ సాధించాయి. మరో వైపు ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి ఆరుగురు పాక్ బౌలర్లు 100కుపైగా పరుగులు ఇచ్చుకున్నారు.

News October 10, 2024

సొంత ఎమ్మెల్యేలపైనే బాబు బురద జల్లుతున్నారు: రోజా

image

AP: తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే బురద జల్లుతున్నారని సీఎం చంద్రబాబుపై వైసీపీ నేత రోజా మండిపడ్డారు. ‘మొదటి కలెక్టర్లు, ఎస్పీల సమావేశంలోనే మాది పొలిటికల్ గవర్నెన్స్.. మా వారు చెప్పిందే చేయండి’ అని చెప్పారు. దందాలపై వ్యతిరేకత వచ్చే సరికి ఇప్పుడు తప్పులను ఎమ్మెల్యేలపై నెడుతున్నారు. బాబుకు చిత్తశుద్ధి ఉంటే తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాలి’ అని ఆమె ట్వీట్ చేశారు.