News October 10, 2024
ఒకే ఇంట్లో నలుగురు MBBSలు
TG: ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం. కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమత 2018లో, రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కూతుళ్లు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. వీరిని హరీశ్ రావు అభినందించారు.
Similar News
News November 12, 2024
30 ఏళ్ల క్రితం రూ.60 చోరీ.. తాజాగా అరెస్టు
తమిళనాడులోని తెప్పకులం PS పరిధిలో 30 ఏళ్ల క్రితం ₹60 చోరీ చేసిన నిందితుడిని మధురై పోలీసులు తాజాగా అరెస్టు చేశారు. పెండింగ్ కేసులు విచారిస్తుండగా ఈ కేసు వెలుగుచూసింది. పోలీసులు జక్కతోప్పు ప్రాంతానికి వెళ్లి నిందితుడు పన్నీర్ సెల్వం కోసం విచారించారు. అతను శివకాశిలో ఉంటున్నాడని తెలిసి అక్కడికి వెళ్లి అరెస్టు చేశారు. సగటు ద్రవ్యోల్బణం 6.5% వేసుకున్నా అప్పటి ₹60 విలువ 2024లో ₹396.86 అవుతుంది.
News November 12, 2024
కోహ్లీకిదే ఆఖరి సిరీస్: కోడై కూస్తున్న ఆసీస్ మీడియా
విరాట్ కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమయ్యారని ఆస్ట్రేలియన్ మీడియా కోడై కూస్తోంది. అతడికి BGT సిరీసే ఆఖరిదని హెరాల్డ్ సన్ ఆర్టికల్ ప్రచురించింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ అతడి పాత్రను భర్తీచేస్తారని, ఇప్పటికే తనను తాను నిరూపించుకున్నారని తెలిపింది. ‘ఈ సమ్మర్లో ఆసీస్ తీరంలో కోహ్లీ ఫేర్‌వెల్‌కు సిద్ధమైనట్టు కనిపిస్తోంది. 2012 తర్వాత అతడు ఆస్ట్రేలియా-భారత్ రైవల్రీని మరో స్థాయికి తీసుకెళ్లారు’ అని పేర్కొంది.
News November 12, 2024
6 కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం
AP: కురుబ, కళింగ, వన్యకుల, ఆర్యవైశ్య, శెట్టి బలిజ, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్లకు ప్రభుత్వం డైరెక్టర్లను నియమించింది. ప్రతి కార్పొరేషన్‌లో ఇద్దరు జనసేన, ఒక బీజేపీ నేతకు డైరెక్టర్‌గా అవకాశం కల్పించింది. కార్పొరేషన్‌కు 15 మంది డైరెక్టర్ల చొప్పున మొత్తం 90 మందిని నియమిస్తూ ప్రకటన విడుదల చేసింది.