News October 3, 2024

గడ్డం గీయించుకుంటుంటే ఢీ కొట్టిన ట్రక్కు!

image

మృత్యువు ఎప్పుడు ఎలా కబళిస్తుందో ఊహించడం అసాధ్యం. UPలో జరిగిన ఈ ఘటనే అందుకు నిదర్శనం. చాంద్‌వారీ గ్రామానికి చెందిన రాజేశ్(55) హైవే పక్కన ఉన్న ఓ సెలూన్‌లో గడ్డం గీయించుకుంటున్నారు. అదే సమయానికి హైవేపై వెళ్తున్న ఓ డీసీఎం ట్రక్కు అదుపు తప్పింది. సరిగ్గా ఆ సెలూన్ షాపుపైకి దూసుకెళ్లింది. దీంతో రాజేశ్ అక్కడికక్కడే మరణించారు. షాపులో ఉన్న మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు.

Similar News

News October 10, 2024

ఏపీకి వెళ్లే IAS, IPS ఆఫీసర్లు వీరే..

image

ఏపీ క్యాడర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నుంచి <<14323982>>రిలీవ్<<>> చేసింది. ఈ నెల 16 లోగా ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. అందులో ఐఏఎస్ ఆఫీసర్లు వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, వాణిప్రసాద్, మల్లెల ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీకుమార్, అభిలాష బిస్త్, అభిషేక్ మొహంతి ఉన్నారు. తమను తెలంగాణకు కేటాయించాలని కోరగా కేంద్రం తిరస్కరించింది.

News October 10, 2024

ఒకే ఇంట్లో నలుగురు MBBSలు

image

TG: ఎంబీబీఎస్ చదవాలని ప్రతి ఒక్కరికీ కోరిక ఉంటుంది. కానీ అందరికీ ఆ అవకాశం దక్కడం కష్టం. కానీ సిద్ధిపేటలో ఓ కుటుంబానికి చెందిన నలుగురు అక్కాచెల్లెళ్లు ఎంబీబీఎస్ సీట్లు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. కొంక రామచంద్రం, శారద దంపతులకు నలుగురు కుమార్తెలు. పెద్ద కుమార్తె మమత 2018లో, రెండో కుమార్తె మాధవి 2020లో, ఈ ఏడాది మరో ఇద్దరు కూతుళ్లు ఎంబీబీఎస్‌లో అడ్మిషన్ పొందారు. వీరిని హరీశ్ రావు అభినందించారు.

News October 10, 2024

800: 147 ఏళ్ల చరిత్రలో నాలుగోసారే

image

పాకిస్థాన్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్ 823/7 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. కాగా 27 ఏళ్ల తర్వాత ఓ టెస్టు మ్యాచ్‌లో 800కుపైగా పరుగులు నమోదయ్యాయి. అలాగే 147 ఏళ్ల టెస్టు చరిత్రలో ఇప్పటివరకు శ్రీలంక, ఇంగ్లండ్ మాత్రమే 800కుపైగా స్కోర్లు చేశాయి. లంక ఓసారి, ఇంగ్లండ్ మూడు సార్లు ఈ ఫీట్ సాధించాయి. మరో వైపు ఇంగ్లండ్ బ్యాటర్ల ధాటికి ఆరుగురు పాక్ బౌలర్లు 100కుపైగా పరుగులు ఇచ్చుకున్నారు.