News October 3, 2024
ఉగ్ర దాడి: కొడుకును కాపాడి చనిపోయిన తల్లి!

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో నిన్న జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో సెగెవ్ విగ్డర్ అనే 33ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె తన 9నెలల కొడుకును కాపాడుకునే క్రమంలో తూటాలకు బలయ్యారు. ఆమె కొడుకు ఆరి సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. సెగెవ్ ఒక ఫిట్‌నెస్ స్టూడియో ఓనర్ అని, తన భర్త రిజర్వ్ సైనికుడిగా పనిచేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.
Similar News
News December 13, 2025
రామేశ్వరం కేఫ్‌లో కేటీఆర్, అఖిలేశ్

TG: హైదరాబాద్‌లో పర్యటిస్తున్న యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ ఇవాళ రామేశ్వరం కేఫ్‌ను సందర్శించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో కలిసి అక్కడికి వెళ్లారు. కేఫ్‌లో వారిద్దరూ టిఫిన్ చేశారు. ఈ ఫొటోలను కేటీఆర్ తన X ఖాతాలో షేర్ చేశారు. కాగా నిన్న హైదరాబాద్‌కు వచ్చిన అఖిలేశ్.. తొలుత సీఎం రేవంత్ రెడ్డితో, తర్వాత కేటీఆర్‌తో భేటీ అయ్యారు.
News December 13, 2025
మహిళలూ ఈ తప్పులు చేస్తున్నారా?

మహిళలు చేసే కొన్ని తప్పులు గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతాయంటున్నారు నిపుణులు. 30 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి ఏడాదీ స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలి. ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, తక్కువ పండ్లు, కూరగాయలు తిన్నప్పుడు ఆహారంలో యాంటీఆక్సిడెంట్లు లోపిస్తాయి. దీంతో రోగనిరోధక శక్తి తగ్గి HPV ఇన్ఫెక్షన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువ. వీటితో పాటు గర్భధారణలో చేసే తప్పులు కూడా దీనికి కారణమంటున్నారు.
News December 13, 2025
HILTP: భూ బదిలీకి ఒక్క దరఖాస్తూ రాలేదు

TG: హిల్ట్ (HILT) విధానం కింద పారిశ్రామిక భూముల బదిలీ కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TSIIDC)కు ఇంకా ఎలాంటి దరఖాస్తులూ అందలేదు. తెలంగాణలో 21 పారిశ్రామికవాడలు ఉన్నాయి. HILTను NOV 22న ప్రకటించారు. దీని కింద భూముల బదిలీకి ప్రభుత్వం అవకాశం కల్పించింది. అయితే పరిశ్రమల యాజమాన్యాల నుంచి ఎలాంటి స్పందన రాలేదని అధికారులు తెలిపారు. త్వరలోనే యాజమాన్యాలతో ప్రభుత్వం భేటీ కానుంది.


