News October 3, 2024

ఉగ్ర దాడి: కొడుకును కాపాడి చనిపోయిన తల్లి!

image

ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్‌లో నిన్న జరిగిన టెర్రరిస్టుల కాల్పుల్లో 8 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. మృతుల్లో సెగెవ్ విగ్డర్ అనే 33ఏళ్ల మహిళ ఉన్నారు. ఆమె తన 9నెలల కొడుకును కాపాడుకునే క్రమంలో తూటాలకు బలయ్యారు. ఆమె కొడుకు ఆరి సురక్షితంగా ఉన్నాడని అధికారులు తెలిపారు. సెగెవ్ ఒక ఫిట్‌నెస్ స్టూడియో ఓనర్ అని, తన భర్త రిజర్వ్ సైనికుడిగా పనిచేస్తున్నారని స్థానిక మీడియా పేర్కొంది.

Similar News

News January 21, 2026

నేటి ముఖ్యాంశాలు

image

* BJP జాతీయాధ్యక్షుడిగా నితిన్ నబీన్ ప్రమాణం
* నితిన్ నా బాస్.. నేను కార్యకర్తను మాత్రమే: మోదీ
* దావోస్‌లో గూగుల్ క్లౌడ్, IBM CEOలతో చంద్రబాబు భేటీ
* ఫోన్ ట్యాపింగ్‌ కేసులో 7 గంటలపాటు హరీశ్ రావును విచారించిన సిట్
* హరీశ్ విచారణపై INC-BRS నేతల మధ్య డైలాగ్ వార్
* పెండింగ్ చలాన్లపై బలవంతం చేయొద్దు: TG హైకోర్టు
* ఇవాళ రూ.22వేలు పెరిగిన కేజీ వెండి ధర, రూ.1.52లక్షలకు చేరిన 24క్యారెట్ల 10గ్రా. బంగారం

News January 21, 2026

మే నెలలో సముద్రంలోకి మత్స్య-6000

image

సముద్ర గర్భ రహస్యాల అన్వేషణలో భారత్ కీలక అడుగు వేయబోతుంది. ‘సముద్రయాన్’ ప్రాజెక్టులో భాగంగా చెన్నై NIOT కేంద్రంలో తయారైన నాలుగో తరం సబ్‌మెరైన్ ‘మత్స్య-6000’ను మే నెలలో సముద్రంలోకి ప్రవేశపెట్టనున్నారు. డీప్ ఓషియన్ మిషన్ (DOM) కింద రూపొందిన ఈ సబ్‌మెరైన్‌లో 500 మీటర్ల లోతు వరకు ముగ్గురు ఆక్వానాట్స్ ప్రయాణిస్తారు. ఈ ప్రయోగం విజయవంతమైతే US, రష్యా, చైనా, ఫ్రాన్స్, జపాన్ సరసన భారత్ నిలుస్తుంది.

News January 21, 2026

ముంబైపై ఢిల్లీ ఘన విజయం

image

WPL: ముంబై ఇండియన్స్‌పై ఢిల్లీ క్యాపిటల్స్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్(51*), లీ(46) చెలరేగడంతో 155 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. ఢిల్లీ బ్యాటర్లను కట్టడి చేయడంలో ముంబై బౌలర్లు పూర్తిగా విఫలమయ్యారు. అమన్‌జోత్ కౌర్, వైష్ణవికి చెరో వికెట్ దక్కింది. ముంబై బ్యాటర్లలో బ్రంట్(65), హర్మన్ ప్రీత్(41) మాత్రమే రాణించారు.