News October 3, 2024

వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చడం దురదృష్టకరం: వెంకటేశ్

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.

Similar News

News October 3, 2024

మణిపూర్‌లో అరుదైన దృశ్యం

image

మణిపూర్‌లో 17నెలల తర్వాత కుకీ, మైతేయి తెగల వ్యక్తులు కౌగిలించుకొని, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. Sep 27న గూగుల్ మ్యాప్స్‌‌ని నమ్మి మైతేయి వ్యక్తులు కుకీ ఆధిపత్య గ్రామంలోకి ప్రవేశించి, బందీలయ్యారు. ప్రభుత్వ జోక్యంతో కుకీ సివిల్ సొసైటీ వారిని విడుదల చేసింది. వారిని సొంత తెగకు అప్పగించే క్రమంలో వారు హగ్ చేసుకున్న ఫొటో వైరలవుతోంది. ఈ తెగల మధ్య విబేధాలతో మణిపూర్‌లో ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే.

News October 3, 2024

డైరెక్ట్‌గా OTTలో రిలీజ్ కానున్న ‘ఇండియన్-3’?

image

విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా శంకర్ తెరకెక్కిస్తోన్న ‘భారతీయుడు-3’ సినిమాపై మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే రిలీజైన ‘భారతీయుడు-2’ ఆశించిన మేర కలెక్షన్లను రాబట్టలేకపోయింది. దీంతో వచ్చే ఏడాది జనవరిలో విడుదలకానున్న ‘ఇండియన్-3’ను డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ చేసేందుకు సిద్ధమయ్యారని సినీవర్గాలు తెలిపాయి. OTT ప్లాట్‌ఫామ్ ‘నెట్‌ఫ్లిక్స్’లో ఇది స్ట్రీమింగ్ కానుందని పేర్కొన్నాయి.

News October 3, 2024

బహిరంగ క్షమాపణలు చెప్పాలి: వైజయంతి మూవీస్

image

సమంతపై మంత్రి కొండా సురేఖ చేసిన అనుచిత వ్యాఖ్యలపై వైజయంతి మూవీస్ స్పందించింది. ‘తెలుగు చిత్ర పరిశ్రమలో 50 ఏళ్ల చరిత్ర కలిగిన నిర్మాణ సంస్థగా ఈ అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సంస్కారవంతమైన కుటుంబాల నుంచి వచ్చాం. జవాబుదారీతనం లేకుండా ఎవరైనా అమర్యాదగా మాట్లాడితే సహించం. మా పరిశ్రమను, దాని సభ్యులను తక్కువ చేసి మాట్లాడిన వారు బహిరంగ క్షమాపణలు చెప్పాలి. కలిసి నిలబడతాం’ అని ట్వీట్ చేసింది.