News October 3, 2024

వ్యక్తిగత విషయాలను ఆయుధంగా మార్చడం దురదృష్టకరం: వెంకటేశ్

image

మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు విని ఎంతో బాధేసిందని హీరో విక్టరీ వెంకటేశ్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంగా మార్చుకోవడం దురదృష్టకరం. ఇలా చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. కానీ, ఆ వ్యక్తులకు మరింత బాధనిస్తుంది. నాయకత్వ స్థానాల్లో ఉన్నవారు సంయమనం పాటించాలని కోరుతున్నా. సినీ పరిశ్రమ ఇలాంటివి సహించదు’ అని పేర్కొన్నారు.

Similar News

News November 12, 2024

అలాంటి కాల్స్‌కు స్పందించొద్దు: TG పోలీసులు

image

‘మీ బ్యాంకు ఖాతా నిలిపివేయబడింది’ అంటూ వచ్చే మెసేజ్‌లు, కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ పోలీసులు సూచిస్తున్నారు. అలాంటి మెసేజ్‌లు, కాల్స్‌కు స్పందించవద్దని ఓ ప్రకటనలో తెలిపారు. ఇలాంటి స్పామ్ మెసేజ్‌లను క్లిక్ చేస్తే బ్యాంకు ఖాతాలు ఖాళీ అవుతాయని, సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని పేర్కొన్నారు.

News November 12, 2024

రాహుల్ వ్యాఖ్య‌ల‌ను సెన్సార్ చేయండి: బీజేపీ

image

మ‌హారాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల నేపథ్యంలో అబద్ధాలు ప్ర‌చారం చేయకుండా రాహుల్ వ్యాఖ్య‌ల‌ను సెన్సార్ చేయాలని ECని BJP కోరింది. ప్ర‌చార సభల్లో రాహుల్ మాట్లాడుతూ MH అవ‌కాశాల‌ను ఇత‌ర రాష్ట్రాలు దోచుకుంటున్నాయంటూ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నార‌ని, రాజ్యాంగాన్ని బీజేపీ తుంగ‌లో తొక్కుతోందంటూ ప్ర‌జ‌ల్ని త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నార‌ని ఫిర్యాదు చేసింది. అత్యధిక FDIలు MHకే దక్కాయని BJP నేతలు గుర్తు చేస్తున్నారు.

News November 12, 2024

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ప్రభుత్వం అలర్ట్

image

AP: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్‌తో హోంమంత్రి అనిత సమీక్ష నిర్వహించారు. రాయలసీమ, దక్షిణ కోస్తాలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశమున్న నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆదేశాలు జారీ చేశారు. రైతులను, ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.